Dragon: డైరెక్టర్ దేవ కట్టా చేతికి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ.. ఆలస్యం అందుకేనా?
ఎన్టీఆర్ డ్రాగన్(Dragon) సినిమా కోసం దర్శకుడు దేవ కట్టాను తీసుకున్న మేకర్స్.
Director Deva Katta in NTR Dragon movie
- డ్రాగన్ సెట్స్ లోకి దర్శకుడు దేవ కట్టా
- కీలక బాధ్యతలు అప్పగించిన ప్రశాంత్ నీల్
- ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ డైలాగ్స్
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘దేవర’ ఘనవిజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, డ్రాగన్ సినిమా కోసం ప్రశాంత్ నీల్‌కు తోడుగా మరో ప్రస్టార్ దర్శకుడు దేవా కట్టా పని చేయనున్నాడట.
RB Choudhary: సినీ లోకంలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూత
సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ప్రశాంత్ నీల్(Dragon) కొన్ని కీలక బాధ్యతలను దేవా కట్టాకు అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లకు దేవా కట్టా దర్శకత్వం వహించనున్నారని, అలాగే సినిమాకు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వారణాసి వంటి సినిమాలకు రచయితగా పనిచేస్తున్న ఆయన, ‘డ్రాగన్’ స్క్రిప్ట్ విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
దేవా కట్టా అనగానే ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సినిమాల్లోని లోతైన రాజకీయ, సామాజిక విశ్లేషణలు, తూటాల్లాంటి మాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం కోసం ఆయన రాసే సంభాషణలు థియేటర్లలో ప్రకంపనలు సృష్టిస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, దేవా కట్టా పదునైన మాటలు కలిస్తే ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
