Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో మరో స్టార్.. అక్షయ్ కుమార్ ఎంట్రీతో భారీ హైప్
అల్లు అర్జున్ 'రాకా(Raaka)' సినిమాలో కీ రోల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.
akshay kumar playing key role in allu arjun raaka movie
- రూ.800 కోట్లతో భారీ విజువల్ వండర్
- అల్లు అర్జున్ ఊరమాస్ గ్లోబల్ ఎంట్రీ
- అక్షయ్ కుమార్ రాకాతో అంచనాలు రెట్టింపు
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న ‘రాకా’ చిత్రం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా ఒక విభిన్నమైన, పవర్ఫుల్ గెటప్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Dragon: డైరెక్టర్ దేవ కట్టా చేతికి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ.. ఆలస్యం అందుకేనా?
ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పాడుకొనే, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ‘రాకా(Raaka)’ మూవీ ఒక పాన్-వరల్డ్ సినిమాగా గుర్తింపు పొందుతోంది. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత విలువలతో రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ చేరడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ ఎంట్రీతో ఈ సినిమా అంచనాలు రెట్టింపు అయ్యాయి. అల్లు అర్జున్, అక్షయ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై హైలైట్‌గా నిలుస్తాయని టాక్ నడుస్తోంది. మొత్తానికి ‘రాక’ చిత్రం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది.
