Tvk Vijay: ఆ రోజే..! తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!
ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది.
Tvk Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఎల్లుండి సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని విజయ్ నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపు తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ ను కలవనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతి కోరనున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు లేదా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ఆలోచిస్తున్నట్లు తమిళ పాలిటిక్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
రేపు గవర్నర్ ను కలిసిన తర్వాత వెంటనే ఎల్లుండి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నట్లు అర్థమవుతోంది. చెన్నై సెంట్రల్ లోని నెహ్రూ స్టేడియం విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వేదిక కానుంది. ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది.
Also Read: తమిళనాడులో చరిత్ర సృష్టించిన తెలుగు ఎమ్మెల్యే.. టీవీకే నుంచి ఘన విజయం
