TVK Telugu MLA Keerthana: తమిళనాడులో చరిత్ర సృష్టించిన తెలుగు ఎమ్మెల్యే.. టీవీకే నుంచి ఘన విజయం
Keerthana TVK Telugu MLA: టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన కీర్తన 68వేల 709 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్‌ను 11వేల 670 ఓట్ల తేడాతో ఓడించారు.
Telugu Mla Keerthana S From Tvk Party Creates History
TVK Telugu MLA Keerthana S: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించింది. 100కు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ద్రవిడ పార్టీ దిగ్గజాలుగా పేరొందిన డీఎంకే, అన్నాడీఎంకేకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ రెండు పార్టీలు 60 ఏళ్లుగా తమిళనాట సత్తా చాటుతున్నాయి. అలాంటి ద్రవిడ పార్టీలను విజయ్ మట్టికరిపించారు.
సినీ రంగం నుంచి వచ్చిన ఎంజీఆర్ 1977లో, జయలలిత 1991లో ముఖ్యమంత్రులు అయ్యారు. 35 ఏళ్ల తర్వాత అదే రంగం నుంచి వచ్చిన విజయ్ ఇప్పుడు సీఎం కావడం దాదాపు ఖాయమైంది. మేజిక్ ఫిగర్‌కు మరో 10 స్థానాలు తక్కువ ఉండటంతో ఎవరితో వెళ్లాలనే అంశంపై టీవీకే పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలతో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. టీవీకే నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఓ తెలుగు వ్యక్తి కూడా ఉండటం విశేషం. ఆ ఎమ్మెల్యే పేరు ఎస్ కీర్తన. వయసు 30 ఏళ్లు. శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కీర్తన. ఈ విజయంతో ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. 1957 నుంచి ఇప్పటిదాకా అక్కడ ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా కీర్తన నిలిచారు. టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన కీర్తన 68వేల 709 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్‌ను 11వేల 670 ఓట్ల తేడాతో ఓడించారు. కీర్తన పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె వృత్తిరిత్యా కన్సల్టెంట్.
Also Read: నేను రాజీనామా చేయను.. మమత సంచలనం
