Before Death By Suicide Man Texted Colleagues He Was Upset colleagues
ఆఫీసులో సహోద్యోగులతో అసంతృప్తి చెందిన ఒక వ్యక్తి(40).. ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్‌లోని రవి నగర్ కాలనీలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడు ఒక మల్లీనేషనల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కాగా, తాను ఒక విపత్కర నిర్ణయం తీసుకున్నానని తన సహోద్యోగుల్లో కొందరికి మెసేజ్ చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
బుధవారం ఉదయం 7:20 నిమిషాలకు అమిత్ భార్యకు అతడు పని చేసే ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు కుమార్ అని అమిత్ సహోద్యోగినని చెప్పాడు. తనకు పంపిన మెసేజ్ గురించి ఆమెకు చెప్పి ఒకసారి అమిత్ బాగానే ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఆమెకు అనుమానం కలిగి హుటాహుటిన మెట్లెక్కి చూడగా.. అప్పటికే అమిత్ ఉరి వేసుకున్నాడు. వెంటనే అతడిని మెదాంత ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయమై సెక్టార్ 9ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భార్య పూజా మోహర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమిత్, పూజాలకు పెళ్లై పదేళ్లైంది. కాగా, ఆఫీసు పనిలో ఒక నిర్ణయమై ఒక మహిళా సహోద్యోగితో అమిత్‌కు గొడవైందని, ఈ కారణం చేతనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వస్తున్నాయి. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు.