Pegasus Scandal : దీదీ కీలక నిర్ణయం..పెగాసస్ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు
పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
- venkaiahnaidu
- Published On : July 26, 2021 / 03:00 PM IST
Mamata
Pegasus Scandal పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వాస్తవానికి ఈ పని కేంద్రమే చేయాల్సిందని..కానీ ఈ విషయంపై మోదీ సర్కారు మౌనంగా ఉండిపోయిందని మమత విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఈ కమిషన్‌లో.. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ సభ్యులుగా ఉన్నారు.
READ Congress On Pegasus Spyware : అమిత్ షా రాజీనామా చేయాలి..మోదీపై విచారణ జరగాలి
పెగాసస్ ద్వారా న్యాయవ్యవస్థ, పౌర సమాజంతో పాటు ప్రతి ఒక్కరినీ నిఘా నీడలో ఉంచారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తుందని భావించాం. కానీ వారు అలా చేయలేదు. పెగాసస్‌పై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిన తొలి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. రాష్ట్రానికి చెందిన కొందరి పేర్లు పెగాసస్ టార్గెట్ లిస్ట్ లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా హ్యాకింగ్‌కు పాల్పడటంపై కమిషన్ విచారణ చేపడుతుందని మమత తెలిపారు. కాగా,టీఎంసీలో నెం.2గా ఉన్న మమత మేనల్లుడు మరియు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఫోన్ ని కూడా పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
