West Bengal: బెంగాల్‌లో మార్చి నాటికి 32వేల టీచర్ ఉద్యోగాలు

వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రాబోయే మార్చి నాటికి 32వేల టీచర్ ఉద్యోగాలకు అవకాశం కల్పించనుంది. ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైమరీ లెవల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ అన్నారు.

West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రాబోయే మార్చి నాటికి 32వేల టీచర్ ఉద్యోగాలకు అవకాశం కల్పించనుంది. ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైమరీ లెవల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ అన్నారు.

ఈ అపాయింట్మెంట్ ప్రక్రియలో కనీసం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో 14వేల ఖాళీలు, ప్రైమరీ లెవల్ లో 10వేల 500ఖాళీల్లో టీచర్లను రిక్రూట్ చేయనున్నారు. అక్టోబరులో దుర్గా పూజకు ముందే వీరందరూ పోస్టుల్లో ఉంటారని అన్నారు. మిగిలిన 7వేల 500 మంది టీచర్ పోస్టులు మార్చి 2022నాటికి భర్తీ అవుతాయి.

మొత్తంగా వచ్చే మార్చి నాటికి 32వేల టీచర్ పోస్టుల్లో రిక్రూట్ అవనున్నారు. మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఉద్యోగాలిస్తామని మమతా అన్నారు. ఉద్యోగ అర్హతకు నిర్వహించే పరీక్షలో పాస్ అయితేనే పోస్టుల్లోకి తీసుకుంటాం. కోర్టు కేసుల కారణంగా అపాయింట్మెంట్లు కాస్త ఆలస్యమయ్యాయని బెనర్జీ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు