×
Ad

అమ్మకోసం..వట్టిచేతులతో బావి తవ్విన యువతి: లేడీ భగీరథ

  • Publish Date - June 30, 2020 / 11:32 AM IST

మన దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ఈ రోజుల్లో కూడా గుక్కెడునీటి కోసం పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. నీటికోసం కన్నతల్లి పడుతున్న కష్టాల్ని చూసిన ఓ యువతి భగీరథుడిలా మారింది. అమ్మ కష్టాలను చూడలేకపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకోసం ఏదైనా చేయాలని తపించింది. ఇందుకోసం ఆమె భగీరథ ప్రయత్నమే చేసింది. అమ్మ కోసం ఏకంగా ఇంట్లోనే ఓ బావిని తవ్వేసింది. అదికూడా వట్టి చేతులతోనే. అంటే ఆ అమ్మాయికి అమ్మంటే ఎంత ప్రేమోఅర్థం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే..బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల బొబితా సోరెన్ పేదింటి అమ్మాయి. చదువు అంటే చాలా ఇష్టం. బుర్ద్వాన్ జిల్లాలోని సంక్షేమ హాస్టల్ లో ఉండి బీఈడీ చదువుకుంటోంది. లాక్ డౌన్ తో అన్నీ మూసేయటంతోఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లి నీటికోసం కిలోమీటర్ల కొద్దీ నీళ్లకోసం వెళ్లటం చూసింది. అసలే ఓ పక్క పేదరికం..మరోపక్క అనారోగ్యంతో బాధపడే అమ్మ..కిలోమీటర్ల కొద్దీ నీటికోసం వెళ్లటం చూసిన బొబితా మనస్సు ద్రవించిపోయింది. లాక్ డౌన్ సమయంలో అమ్మకష్టాన్ని తీర్చాలనుకుంది.
అమ్మకోసం వట్టి చేతులతో బావిని తవ్వేసింది. 50 ఏళ్ల వయస్సులో తీవ్ర రక్త హీనతతో బాధపడుతున్న అమ్మ నినా సోరెన్ ఆపసోపాలు పడుతూ నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి పడుతున్న కష్టాలను కళ్లారా చూసింది. తల్లిని చూసి బొబితా మనసు ద్రవించిపోయింది. అమ్మ కష్టాన్ని ఎలాగైనాసరే తీర్చాలనుకుంది.

లేడీ భగీరథగా మారి తన చేతులనే ఆయుధాలుగా భావించింది. కష్టపడి ఇంట్లోనే 15 అడుగుల లోతుగా ఓ బావి తవ్వేసింది. నీరు చక్కగా పైకి ఉప్పొంగటంతో బొబితా మనస్సు ఆనందంతో గంతులు వేసింది. అది చూసిన తల్లి మనస్సు పులకించిపోయింది. నా బంగారు తల్లి నాకోసం భగీరథ యత్నం చేసిన పాతాళ గంగను పైకి తెచ్చింది అంటూమురిసిపోయింది.

దీనిపై బొబితా మాట్లాడుతూ..‘మా నాన్న..నా సోదరుడు సహకారంతో బావి తవ్వటానికి యత్నించాను. వాళ్లిద్దరూ గట్టిగా తాళ్లు నా నడుముకి కట్టారు. వాటి సాయంతో నేను బావి అడుగు..అడుగు తవ్వుకుంటూ వెళ్లాను..అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ నీరు వచ్చేదాకా తవ్వాను. అలా పైకి పొంగిన గంగమ్మతో మా అమ్మ పడే నీటి అడుగులు తవ్వాక మా నీటి కష్టాలు ఫలించాయి. బావిలోపొంగిన నీరు చూసి మా అమ్మ ఎంతో ఆనందించింది..అమ్మ కష్టాలను తీర్చగలిగాం అంటూ బొబితా ఆనందం వ్యక్తంచేసింది. ఇక మా అమ్మ నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడవనవసరం లేదంటూ సంతోషంగా చెప్పింది. కాగా..ఇప్పటికే పొలిటికల్ సైన్స్ లో ఎమ్‌ఏ పూర్తి చేసిన బొబితా.. ప్రస్తుతం బీఈడీ చదువుకుంటోంది.

Read:బాయ్ కాట్ చైనా, రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదు