Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌(Prakash Raj)కు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

Bengaluru court issues non bailable warrant against actor Prakash Raj

  • ప్రకాష్ రాజ్‌కు గట్టి షాక్.
  • జారీఅయిన నాన్ బెయిలబుల్ వారెంట్.
  • నాలుగు రాష్ట్రాల్లో ఓటు వివాదం.

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. గతంలో నమోదైన ఒక వివాదాస్పద కేసు విచారణకు ఆయన వరుసగా గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.

Ketan Agarwal Murder Case: లోయలోకి తోసింది కాబోయే భార్యే.. ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్.. కేతన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగింది. ప్రకాష్ రాజ్ దేశంలోని వివిధ రాష్ట్రాలలో అక్రమంగా ఓటు హక్కులను కలిగి ఉన్నారంటూ అప్పట్లో ఒక ఫిర్యాదు నమోదైంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రాష్ట్రంలో కూడా ఆయనకు ఓటు హక్కులు ఉన్నాయని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే వ్యక్తి పలు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో దీనిపై కోర్టులో విచారణ ప్రారంభమైంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరు న్యాయస్థానం గతంలో పలుమార్లు ప్రకాష్ రాజ్‌(Prakash Raj)కు సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించినప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక్కసారి కూడా విచారణకు రాలేదు. న్యాయస్థానం ఆదేశాలను పదే పదే ధిక్కరించడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, తాజాగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.