దిమ్మతిరిగింది : రూ.17వేలు ఫైన్ కట్టిన వాహనదారుడు

కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జేబులు గుల్ల చేస్తోంది. అప్పుల పాలయ్యే పరిస్థితి తెస్తోంది. భారీ మొత్తంలో చలాన్లు కట్టలేక వాహనదారులు

  • Publish Date - September 5, 2019 / 07:58 AM IST

కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జేబులు గుల్ల చేస్తోంది. అప్పుల పాలయ్యే పరిస్థితి తెస్తోంది. భారీ మొత్తంలో చలాన్లు కట్టలేక వాహనదారులు

కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జేబులు గుల్ల చేస్తోంది. అప్పుల పాలయ్యే పరిస్థితి తెస్తోంది. భారీ మొత్తంలో చలాన్లు కట్టలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  గురుగావ్ కి చెందిన ఓ బైకిస్ట్ ఫైన్ రూపంలో రూ.23వేలు చెల్లించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఘటన బెంగళూరులో జరిగింది. ఓ బైకిస్ట్ ఏకంగా రూ.17వేలు ఫైన్  కట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఆకాష్ అనే వ్యక్తి కొత్త మోటారు వాహన చట్టానికి బలయ్యాడు. మూడు ఉల్లంఘనల కింద రూ.17వేలు చెల్లించాడు. వార్తూరులో నివాసం ఉండే ఆకాష్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. 

ఒక్కసారి దొరికితే రూ.17వేలు ఫైన్ ఎలా పడిందంటే..
1. డ్రంకెన్ డ్రైవింగ్ కి రూ.10వేలు
2. లైసెన్స్ లేని దానికి రూ.5వేలు
3. ఆకాష్ అతడి వెనుక బండి మీదున్న వ్యక్తికి హెల్మెట్ లేని దానికి రూ.2వేలు ఫైన్

కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చాక బెంగళూరులో ఇంత మొత్తంలో ఫైన్ కట్టిన తొలి బైకిస్ట్ గా ఆకాష్ రికార్డుల్లోకి ఎక్కాడు. హెల్మెట్ లేకుండా స్కూటీ(వెస్పా) నడుపుతుండగా.. కనకపుర పోలీసులు ఆకాష్ ని ఆపారు. అదే సమయంలో బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేశారు. అథిక మోతాదులో మద్యం తాగినట్టు తేలింది. అంతే భారీ ఎత్తున ఫైన్లు వేశారు. 

ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసేందుకు రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు మోటారు వాహనాల బిల్లును కేంద్రం సవరించింది. భారీ మొత్తంలో ఫైన్లు పెంచింది. సెప్టెంబర్ 1, 2019 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. సో.. రైడర్స్ బీ కేర్ ఫుల్.. డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్ గా ఉంటేనే బండి తీయండి.. రోడ్డు ఎక్కండి.. రూల్స్ ఫాలో అవ్వండి. లేదంటే జరిమానాలు కట్టటానికి బైక్ అమ్మినా ఆ డబ్బులు సరిపోవు.

Also Read : ఆవును రక్షించేందుకు వెళ్లి మహిళ మృతి