బెంగళూరుకు చెందిన వ్యక్తి కొత్త లగ్జరీ కారు కొనేందుకు చూస్తూ ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయిపోయాడు. అడ్వాన్స్ అమౌంట్ అంటూ భారీగా ముట్టజెప్పి 3నెలల తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఖలీల్ షరీఫ్ అనే వ్యక్తి లగ్జరీ కారు తక్కువ రేటులో వస్తుందనేసరికి టెంప్ట్ అయ్యాడు.
జీవన్ బీమానగర్ లోని గ్యారేజి, సర్వీస్ స్టేషన్ కు తరచూ వస్తుండేవాడు. అక్కడే గ్యారేజీ ఓనర్ బంధువును కలిశాడు. తనకు తానుగా దస్తగిర్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి తన వద్ద లగ్జరీ కారు ఉందని రూ.2లక్షలకే ఇస్తానని చెప్పాడు. 2006మోడల్ మెర్సిడెస్ రూ.2.25లక్షలు అని చెప్పాడు. కాసేపటి వరకూ బేరసారాలు జరిగిన తర్వాత రూ.2లక్షలకు ఖాయం చేసుకున్నాడు.
అందులో భాగంగానే గూగుల్ పేలో మార్చి 11న రూ.78వేల అడ్వాన్స్ ఇచ్చాడు. రెండ్రోజుల్లో కారు ఇచ్చేస్తానని చెప్పిన దస్తగిర్ ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. లాక్ డౌన్ ముగిసేంత వరకూ ఎటువంటి రెస్పాన్స్ అందలేదు. మూడు నెలల లాక్ డౌన్ తర్వాత షరీఫ్ గ్యారేజి వద్దకు వెళ్లి దస్తగిర్ గురించి ఎంక్వైరీ చేశాడు.
అప్పుడు గ్యారేజీ ఓనర్ డబ్బులు తిరిగి ఇప్పించేస్తానని హామీ ఇచ్చి పంపించేశాడు. నమ్మకం కుదరకపోవడంతో షరీఫ్ పోలీసులను కలిసి కంప్లైంట్ చేశాడు. అప్పుడే తెలిసింది అతని పేరుపై 30కంప్లైంట్లు ఆల్రెడీ నమోదై ఉన్నాయని.