ఆటల్లో వృద్ధుల సత్తా: నడక పోటీల్లో విజయకేతనాలు 

  • Publish Date - September 20, 2019 / 04:17 AM IST

ప్రతీ మనిషీ  వద్ధాప్యం అంటే భయపడతాడు.శక్తి ఉడికిపోయి..ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి అది. కానీ ఆరోగ్యం..మానసిక ఉల్లాసం ఉంటే వృద్ధాప్యం శాపం కానే కాదు. చక్కటి ఆనందాన్ని అనుభవించి..ఆస్వాదించే దశ అది. 30 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులు..40 కే నడుము నొప్పులో సతమతమవుతున్న నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు వృద్ధులు..60,70 ఏళ్ల దాటినా మాలో సత్తా తగ్గలేదని.. ఆటల్లో పాల్గొని సత్తా చాటారు వృద్ధులు. మరి ఆ సీనియర్ సిటిజన్ల విజయాల గురించి తెలుసుకుందాం..

అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ల కోసం కర్ణాటక ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 20)న క్రీడలు నిర్వహించారు. బెంగళూరులోని కంతీరవ స్టేడియంలో జరిగిన సీనియర్ సిటిజన్ల క్రీడల్లో 250మంది వృద్ధులు పాల్గొన్నారు. వీరంతా 70 సంవత్సరాలు పైబడినవారే కావటం విశేషం. వీరికి 200 మీటర్ల నడక పోటీని నిర్వహించగా లలితమ్మ అనే 72 సంవత్సరాల  మహిళ మొదటి స్థానంలో నిలిచారు.  

ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడతూ..కాలేజ్ ప్రిన్సిపల్ గా  రిటైర్ట్ అయ్యాయనీ..ఆటలంటే తనకు చాలా ఇష్టమనీ..తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఎన్నో పతకాలను సాధించానని తెలిపారు. ఇప్పటికీ తాను ప్రతీ రోజు గంట సమయం వాకింగ్ చేస్తానని..అదే తనకు ఈ విజయం సాధించటానికి ఉపయోగపడిందని తెలిపారు. ఈ వయస్సులో కూడా ఈ వాకింగ్ లు నీకు అవసరమా అని తనను చాలామంది ప్రశ్నిస్తుంటారనీ..కానీ నడక ఆరోగ్యానికి చాలా మంచిది..తను సాధ్యమైనంత వరకూ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండేందుకు తనకు ఆరోగ్యం చాలా అవసమనీ అందుకే తాను ఏరోజు కూడా వాకింగ్ చేస్తుంటానని లలితమ్మ తెలిపారు. 

ఈ పోటీ్లో 81 ఏళ్ల సరోజనమ్మ 100 మీటర్ల వాకింగ్ రేసును  గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాధ్యతలన్నీ తీరిపోయిన తమకు ఇటువంటి క్రీడల వల్ల తిరిగి నూతనోత్సాహం వస్తుందని తమ కోసం ప్రభుత్వం ఇటువంటి ఆటల్ని నిర్వహించటం సంతోషంగా ఉందనీ..ఇది సీనియర్ సిటిజన్ల ప్రభుత్వం చూపే గౌరవంగా భావిస్తున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమం ప్రపంచ వృద్ధుల దినోత్సవమైన అక్టోబర్ 1 వరకూ కొనసాగనుంది.

వృద్ధాప్యం ఏ మనిషికి శాపం కాదు..జీవితాంతం బాధ్యతల సుడిగుండంలో చిక్కుకుని వాటినుంచి ఉపశమనం పొంది..మనకంటూ ఓ జీవితం..మనకంటూ ఓ ఆనందం..మనకంటూ ఓ జీవితం ఉంటుందనీ..ఉండాలని నిరూపించారు ఈ వృద్ధులు. మనస్సుంటే మార్గం ఉండకపోదు..వయస్సు ఎంత అనేది కాదు ముఖ్యం..వయస్సు ఒక అంకె మాత్రమే..జీవితంతో ఆ సంఖ్యను ముడిపెట్టకుండా వృద్ధాప్యాన్ని అనుభవించి..ఆస్వాదించాలని చాటి చెప్పిన వృద్ధుల..కాదు..కాదు ఈ నవ యువకుల సంకల్పానికి ..వారు సాధించిన విజయానికి హ్యట్సాఫ్ చెబుదాం..ఈ పోటీల్లో ఫస్ట్..సెకండ్ వచ్చినవారే విజేతలు కాదు..ఈ పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహంతో వచ్చిన ప్రతీఒక్కరూ విజేతలే.