Bhagawant Singh
Bhagwant Mann: పంజాబ్ అసెంబ్లీలో అఖండ విజయాన్ని నమోదు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే భగవంత్ మన్ ను ఖరారుచేసింది కేజ్రీవాల్ అధిష్టానం. అలా విజయం దక్కించుకున్న భగవంత్.. బుధవారం ఉదయం 10గంటలకు జరిగిన వేడుకలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో ముగించారు. ‘తిరుగుబాటు సుదీర్ఘకాలం ఉండాలి’ అని అర్థం వచ్చేలా నినదించారు. స్వరాజ్య యోధుడు భగత్ సింగ్ మాటల్లో ఫ్యామస్ అయిన నినాదాన్ని సీఎం పలకడం గమనార్హం.
పైగా ఈ ప్రమాణ స్వీకారానికి భగత్ సింగ్ జన్మస్థలమైన నవాన్షార్ జిల్లా, ఖట్కర్ కలాన్ గ్రామాన్ని ఎంచుకున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత భగవంత్ మన్ మాట్లాడుతూ…
Read Also : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇదే చెప్తున్నా. అహంకారం అస్సలు చూపించకండి. మనకు ఓటు వేయని వారిపైనా కూడా గౌరవం చూపించాలి. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని వెల్లడించారు.
అంతకంటే ముందు ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మంటూ ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు సీఎం. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ఆహ్వానించారు.
‘ఒక్క భగవంత్ సింగ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారని ఆయన అన్నారు. అందరం కలిసికట్టుగా షహీద్ భగత్ సింగ్ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాల’ని కోరారు.