Covaxin
COVAXIN: ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కాస్త నెమ్మెది అయినట్లుగానే కనిపిస్తుంది. ప్రొడక్షన్ ఆలస్యం అవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుండగా.. కొవాగ్జిన్ కొవిడ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచనున్నట్లు గురువారం వెల్లడించింది.
గుజరాత్ లోని అంక్లేశ్వర్ లో చిరాన్ బేరింగ్ వ్యాక్సిన్స్ లో తయారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అడిషనల్ ఫెసిలిటీ ద్వారా కొవాగ్జిన్ ప్రొడక్షన్ అనేది మరో 200 మిలియన్ డోసులు ఎక్కువ రానున్నట్లు సమాచారం. అలా సంవత్సరానికి 1బిలియన్ డోసులను కంపెనీ ప్రొడ్యూస్ చేయగలదు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలతో సంయుక్తంగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను రెడీ చేసింది భారత్ బయోటెక్.
భారత్ బయోటెక్ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్ లలో మల్టిపుల్ ప్రొడక్షన్ లైన్స్ తో ఉత్పత్తి చేస్తున్నాయి. అవే కాకుండా బీఎస్ఎల్ రేటెడ్ జీఎంపీ ఫెసిలిటీస్ తో ఉన్న చిరాన్ బేరింగ్ కూడా కలవడంతో కొవాగ్జిన్ ప్రొడక్షన్ మరింత పెరుగుతుంది.
జనవరి 2021లో ఇండియా రెండు కొవిడ్ వ్యాక్సిన్లకు అనుమతిచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొవీషీల్డ్, కొవాగ్జిన్ లకు అప్రూవల్ ఇచ్చింది.
హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన భారత్ బయోటెక్ కేంద్ర ప్రభుత్వానికి రూ.150కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు వ్యాక్సిన్ విక్రయిస్తామని తెలిపింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు మాత్రం రూ.1200ఇస్తామని ప్రకటించింది.