భారత్ సర్జికల్ ఎటాక్ : షేర్ మార్కెట్ ఢమాల్ 

  • Publish Date - February 26, 2019 / 05:18 AM IST

ముంబై : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ పాక్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ప్రభావం షేర్ మార్కెట్ పై పడింది. మంగళవారం (ఫిబ్రవరి 26) తెల్లవారుఝూమున జరిగిన సర్జికల్ ఎటాక్స్ తో  ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 90పాయింట్లు పతనమైంది. అయితే వెంటనే కోలుకొని నష్టాలను246 పాయింట్లకు తగ్గించుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 35,952వద్ద ఉంది. నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 10801 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి.
Also Read : ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం

ఎస్‌బీఐ  సహా కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, యస్‌బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు అన్ని బ్యాంకు షేర్లు నష్టపోతున్నాయి. హీరో మోటో, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, వేదాంతా, అదానీ పవర్‌,  టైటన్‌ , సన్‌ ఫార్మ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, డిష్‌ టీవీ భారీగా  నష్టతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు కరెన్సీ బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. టీసీఎస్‌2 శాతం లాభంతో  52వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ కూడా లాభపడుతోంది.
Also Read : జవాన్లకు రక్షణ కల్పించండి : సుప్రీంలో సైనికుల కూతుర్ల పిటిషన్