భార్య ప్రేమ కోసం ఓ భర్త విడాకులు ఇవ్వబోతున్నాడు. ఇది సినిమా కాదు. నిజం. మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన మహేశ్ భార్య సంగీత ప్రేమ కోసం విడాకులు ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లాడు. సినిమాను తలపించే ఆ కథ గురించి తెలుసుకుందాం..
సంగీతకు ఏడేళ్ల క్రితం మహేశ్ (పేర్లు మార్పు)తో పెళ్లైంది. మహేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.సంగీత ఫ్యాషన్ డిజైనర్. వీరికి ఇద్దరు పిల్లలు. సంగీత పెళ్లి ముందు ఓ యువకుడ్ని ప్రేమించింది. వీళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. మహేశ్ తో పెళ్లి చేశారు. తరువా సంగీతకు ఇద్దరు పిల్లలు పుట్టారు. సంసారం బాగానే నడుస్తోంది. ఇంతలో తాను ప్రేమించినవాడు..తనను మరచిపోలేక ఇంకా పెళ్లి చేసుకోలేదనీ తానే జీవితమని బతుకుతున్నాడని సంగీతకు తెలిసింది. దీంతో అస్తమాను అతడి ఆలోచనల్లోనే ఉండిపోయేది.
దీంతో సంసారంలో గొడవలు. ఆఖరికి ఏదైతే అది అయ్యిదని విషయం భర్తకు చెప్పేసింది. భార్య ప్రేమను అర్థం మహేశ్ అర్థం చేసుకున్నాడు.. సంగీతకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశాడు. దీంతో ఫ్యామిలీ కోర్టులో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమెకు ఎంతో నచ్చచెప్పాననీ..కానీ తాను అతడ్ని మరచిపోలేకపోతోందనీ..అతడితోనే బ్రతకాలని అనుకుంటోందనీ..ఇటువంటి పరిస్థితుల్లో ఆమె తనతో పాటు ఉన్నా..బాధ పడటం తప్ప ఫలితం లేదనీ..దీనికి విడాకులే పరిష్కారం తప్ప మరొకటి లేదని దయచేసి విడాకులు ఇవ్వాలని మహేశ్ కోరాడు.
మహేశ్‌తో విడాకులు తీసుకునేందుకు కూడా సంగీత ఒప్పుకుంది. ఇద్దరు పిల్లల బాధ్యత తానే చూసుకుంటానని మహేశ్ చెప్పాడు. అయితే పిల్లలను చూడాలని అనిపిస్తే ఎప్పుడైనా రావొచ్చు అని పెద్ద మనసుతో సంగీతకు చెప్పాడు మహేశ్. సంగీత సంతోషించింది. మొత్తానికి తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి వద్ద తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్న సంగీతకు త్వరలోనే విడాకులు ఇవ్వనున్నాడు మహేశ్. బహుశా ఇటువంటి కథలు సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో ఉండవనే అనుకుంటాం.కానీ ఇదిగో మహేశ్ (పేరు మార్పు)లాంటి భర్త ఉన్నాడుగా..