కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఎన్నో విషాదకరఘటనలు వెలుగు చూస్తున్నాయి. మానవసమాజం తల దించుకొనే ఘటనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని కనీసం కనికరం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.
కన్న తండ్రి చనిపోతే…చివరి కర్మలు చేయడానికి కొడుకు నిరాకరించిన ఉదంతం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం అతడికి కరోనా వైరస్ రావడమే. తనకు ఒక్కడే కొడుకు…ఇతడి జీవితాన్ని రిస్క్ లో పెట్టలేనని తల్లి చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు…అతడికి తల ఎవరు పెట్టారు ? తెలుసుకోవాలంటే…చదవండి…
భోపాల్ లోని శుజల్ పూర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి పక్షవాతం వచ్చింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో స్థానికంగా ఉన్న
ఆసుపత్రి లో చేరిపించారు. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. దీంతో అతనికి కూడా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ గా వచ్చింది. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ బాధితుడు 2020, ఏప్రిల్ 20వ తేదీన చనిపోయాడు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
భార్య, కొడుకు, బావ మరిది తదితరులు వచ్చారు. శ్మశాన వాటికకు వచ్చినా.డెడ్ బాడీకి దగ్గరకు కూడా రాలేదు.
కర్మకాండలు చేయాలని అధికారులు సూచించారు. దీనికి కొడుకు నిరాకరించాడు. పీపీఈ కిట్స్ తెప్పిస్తామని చెప్పారు. కానీ వారు మాత్రం ససేమిరా అన్నారు. తనకు ఒక్కడే కొడుకు అని..రిస్క్ చేయాలని అనుకోవడం లేదని చనిపోయిన భార్య చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. చివరకు స్థానిక తహశీల్దార్ వచ్చి..,చివరగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించారు. ఏ మాత్రం సంబంధం లేని ఓ వ్యక్తి ఇలా చేయడాన్ని అందరూ అభినందించారు.