Bihar : ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలకు ప్రజలు సాక్షాత్తూ దేవుళ్లమాదిరి కనిపిస్తారు. కంటికి కనిపించినవారికల్లా దణ్ణాలు పెట్టేస్తుంటారు. బాగా తెలిసున్నవారిలా పలకరించేస్తుంటారు..క్షేమ సమాచారాలు అడిగేస్తుంటారు. ఆపై ఓట్లు అడిగేసుకుంటారు. ఆపై నెగ్గితే పత్తా లేకుండా పోతారు. రాజకీయ నాయకుల తీరే అంత. ఎన్నికలొచ్చాయంటూ ప్రజల కాళ్లు పట్టేసుకుంటారు.
సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తూ మీకు కష్టమొస్తే నేనుంటా..దయచేసి నన్ను గెలిపించండీ అంటూ లేనిపోని ప్రేమ ఒలకబోసేస్తుంటారు. ఎన్నికలు జరిగే సమయంలో నేతలు చేసే జిమ్మిక్కులు..చిత్ర విచిత్రమైన పనులు సర్వసాధరణం. అటువంటిదే ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిత్రాలు కనిపిస్తున్నాయి.
బీహార్ మాజీ ఎమ్మెల్యే. ఆరా 73 ఏళ్ల బీజేపీ అభ్యర్థి అమరేంద్ర ప్రతాప్ సింగ్ 73 గతంలో నాలుగుసార్లు ఆరా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015లో బీజేపీ అమరేంద్రకు భోజ్‌పూర్ టిక్కెట్ కేటాయించగా..అమరేంద్ర ప్రత్యర్థిపై కేవలం 666 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ 2020 ఎన్నికల్లో కూడా అమరేంద్ర ప్రతాప్‌కు ఆరా నుంచి పోటీ చేసేందుకు అవకాశం బీజేపీ కల్పించింది.
దీంతో ఆయనగారు ఎలాగైనా సరే నెగ్గాలని తన పదవిని తిరిగి దక్కించుకోవాలని నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లను ఆకట్లుకోవటానికి నానా తపన పడుతున్నారు. దీంట్లో భాగంగా అమరేంద్ర తన నియోజకవర్గం పరిధిలో ఏ ఇంటిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుున్నారు. ఓ ఓటర్ ను వదలకూడదని..ఇంటింటికీ తిరుగుతూ..ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఎంతలా అడుగుతున్నారంటే..ఏకంగా ఓటర్ల కాళ్లమీదపడి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. నాకే ఓటు వేయండి అంటూ కాళ్లావేళ్లా పడి అభ్యర్థిస్తున్నారు. అలా ఓ ఓటరు కాళ్లకు ఏకంగా సాష్టాంగ నమస్కారం పెట్టేస్తూ..దయచేసి నాకే మీ ఓటు వేయండి అంటూ వేడుకుంటున్నారు అమరేంద్ర ప్రతాప్ సింగ్.
కాగా..ఎన్నికల సంఘం కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు స్టార్ క్యాంపెయినర్‌ల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించింది. అలాగే కోవిండ్ నిబంధనలతోనే క్యాంపెయిన్ లు చేసుకోవాలని సూచించింది.