20 ఏళ్లలో రికార్డు స్థాయి వర్షం : డిప్యూటీ సీఎం ఇంట్లోకి నీళ్లు 

  • Publish Date - October 1, 2019 / 04:58 AM IST

ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు   వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో  అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీ ల్‌ మోదీ ఇంట్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. 

ఈ వరదలకు యూపీలో 111 మంది, బిహార్‌లో 27 మంది సహా దేశవ్యాప్తంగా 150కి పైగా చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. బిహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. బిహార్‌ రాజధాని పాట్నాలో పరిస్థితి దారుణంగా ఉంది. కైమూర్, భాగల్పూర్ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో నాలుగు నుంచి ఆరు అడుగల మేర వరద నీరు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాట్నాతో సహా బీహార్‌లోని 24 జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.