Ex MLA Rajan Tiwary: 20 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే.. నేపాల్ బార్డర్‭లో అరెస్ట్

బిహార్‭లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న గోవింద్‭గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తివారి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోరఖ్‭పూర్‭లోని ఒక పోలీసు కానిస్టేబుల్‭పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. 1998లో ఆయనపై కేసు నమోదు అయింది. ఇది గడిచి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత ఆయన పోలీసులకు చిక్కారు

Ex MLA Rajan Tiwary: పోలీసు కానిస్టేబుల్‭పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి రెండు దశాబ్దాలకు పైగా పరారీలో ఉన్న బిహార్‭కు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజన్ తివారీని ఇండియా-నేపాల్ సరిహద్దులోని రాక్సల్ సరిహద్దులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఈయనను అప్పగిస్తే 25,000 రూపాయల నజరానా ఇస్తామని చాలా ఏళ్ల క్రితమే పోలీసులు ప్రకటించారు. ఇప్పటికీ అది ప్రచారంలో ఉన్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు.

ఈ విషయమై చంపారన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కుమార్ ఆశిష్ వివరాలు వెల్లడిస్తూ ‘‘బిహార్‭లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న గోవింద్‭గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తివారి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోరఖ్‭పూర్‭లోని ఒక పోలీసు కానిస్టేబుల్‭పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. 1998లో ఆయనపై కేసు నమోదు అయింది. ఇది గడిచి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత ఆయన పోలీసులకు చిక్కారు’’ అని తెలిపారు.

కాగా, తివారీని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించనున్నట్లు కుమార్ ఆశిష్ తెలిపారు. బిహార్‭లో ఆయనపై ఏదైనా కేసు నమోదైందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి విచారణ ఉత్తరప్రదేశ్ పోలీసులు చూసుకుంటారని పేర్కొన్నారు. రాక్సల్ సరిహద్దు నుంచి ఖాట్మండూ పారపోయేందుకు ప్రతయత్నిస్తుండగా తివారీని పట్టుకున్నట్లు ఎస్పీ కుమార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు