Railway Station: సివిల్ స్టూడెంట్ల కోసం కోచింగ్ సెంటర్‌గా మారిన రైల్వే స్టేషన్

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా సివిల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వారి కోసం ఆ రైల్వే స్టేషన్ కోచింగ్ సెంటర్ గా మారిపోయింది.

Bihar Sasaram

Railway Station: కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా సివిల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వారి కోసం ఆ రైల్వే స్టేషన్ కోచింగ్ సెంటర్ గా మారిపోయింది. బీహార్ లో ఉండే సాసారాం సిటీ రైల్వే జంక్షన్ అక్కడ చాలా ఫామస్. అక్కడ రైల్వే స్టేషన్ కు చెందిన ప్లాట్ ఫాం 1, 2లు కోచింగ్ క్లాసులుగా మారిపోయాయి.

సివిల్ అభ్యర్థుల కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు శిక్షణ కోసం ఉపయోగపడుతుంది. 2002-2003లో ఓ చిన్న స్టూడెంట్ గ్రూప్ చదువుకోవడానికి ఇక్కడకు వస్తుండటంతో ఈ ఆనవాయితీ మొదలైంది. ఆ తర్వాత క్రమంగా ఈ జంక్షన్ ను స్టడీ హబ్ గా మార్చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ గా కూడా మారింది.

ఇక్కడకే రావడానికి కారణమేంటంటే.. ఆ స్టేషన్‌లో 24/7 ఎలక్ట్రికల్ సప్లై ఉండటమే. ఇప్పటికీ ఇండియా చిన్నపాటి నగరాల్లో కరెంట్ కోతలు నడుస్తూనే ఉన్నాయి. దీనిపై ఐఏఎస్ అవనీశ్ శరణ ట్విట్టర్ లో స్పందించారు. కోచింగ్ హబ్ ఫంక్షన్స్ గా ఎలా మారిందనే దాని గురించి మాట్లాడారు.

……………………………………………………… : చేసింది ఒకే సినిమా.. కానీ ఏకంగా ప్రభాస్ తోనే ఛాన్స్..

కేవలం సివిల్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఐఐటీలు, ఐఐఎమ్‌లు అభ్యర్థులు కూడా చదువుకోవడానికి వస్తారు. సీనియర్ స్టూడెంట్లు ఇక్కడకు వచ్చి జూనియర్లకు విలువైన సలహాలు ఇవ్వడంతో పాటు కోచింగ్ కూడా ఇస్తారు. స్టేషన్ కు రావడానికి దాదాపు 500మంది వరకూ ఐడెంటిటీ కార్డులు కూడా ఇష్యూ చేసింది స్టేషన్.