Prabhas : చేసింది ఒకే సినిమా.. కానీ ఏకంగా ప్రభాస్ తోనే ఛాన్స్

 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇప్పటికే ప్రభాస్

Prabhas : చేసింది ఒకే సినిమా.. కానీ ఏకంగా ప్రభాస్ తోనే ఛాన్స్

Meenakshi

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచానాలు పెంచేశారు. ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకి రావడంతో ‘సలార్’ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఇందులో శ్రుతి హాస‌న్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ‘సలార్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌ గా మీనాక్షీ చౌద‌రిని ఎంపిక చేశారు. ఇటీవల తెలుగులో సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పించింది. ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. ఇప్ప‌టికే మాస్ మ‌హరాజ్ ర‌వితేజ స‌ర‌స‌న ‘ఖిలాడి’లో మీనాక్షి కూడా ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు ప్ర‌భాస్ తో ‘సలార్’లో నటించబోతోంది. ఇది మీనాక్షికి మంచి అవ‌కాశ‌మేన‌ని చెప్పుకోవచ్చు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో ఇదంతా తన అదృష్టంగా ఫీల్ అవుతోంది మీనాక్షి. వచ్చిన ఛాన్సులని సరిగ్గా వినియోగించుకుని కరెక్ట్‌గా ప్రమోట్ అవ్వగలిగితే త్వరలోనే స్టార్ హీరోయిన్స్ సరసనకు వెళ్లడం ఖాయం.

Balakrishna : బాలయ్య ఓటు కూడా నాకే : మంచు విష్ణు

‘కె.జి.య‌ఫ్’ చిత్రం త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ‘సలార్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న స‌లార్‌ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. కానీ ఆ తర్వాత అదే రోజున ‘కె.జి.య‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ సినిమా విడుద‌ల‌వుతుంది అని ప్రకటించటంతో సలార్ వాయిదా పడటం ఖాయమనే చెప్పొచ్చు.