Airtel Priority PostPaid : ఎయిర్టెల్ కొత్త ‘ప్రయారిటీ పోస్టుపెయిడ్’వార్.. ఇక 5G అందరికీ ఒకేలా కాదు.. VIP యూజర్లకే ఫుల్ స్పీడ్!
Airtel Priority PostPaid : టెలికం ప్రపంచంలో కొత్త 5జీ వార్ మొదలైంది. ఎయిర్టెల్ కొత్త ‘ప్రయారిటీ పోస్టుపెయిడ్’టెక్నాలజీతో ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్లు, పోస్టు పెయిడ్ యూజర్ల మధ్య 5జీ స్పీడ్ వార్ నడుస్తోంది. పూర్తి వివరాలివే..
Airtel Priority PostPaid ( Image Credit : AI )
- 5జీ నెట్వర్క్ స్లైసింగ్ యూజర్లకు కనెక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యత
- 5జీ స్టాండ్అలోన్ (SA) సపోర్టు చేసే స్మార్ట్ఫోన్లలో మాత్రమే
- నెట్వర్క్ స్లైసింగ్ సింగిల్ 5G నెట్‌వర్క్‌లో వర్చువల్ లేన్లు
- పోస్టుపెయిడ్ యూజర్లు స్పెషల్ ప్రయారిటీ పొందొచ్చు
- ప్రీపెయిడ్ యూజర్ల పరిస్థితి ఏంటి? VIP లేన్ ఎవరికి లాభం?
Airtel Priority PostPaid : ఒకే 5జీ టవర్.. ఒకే సిటీ.. ఒకే టైమ్.. కానీ, ఇద్దరు యూజర్ల ఫోన్లలో మాత్రం డిఫరెంట్ స్పీడ్.. ఒకరు ప్రీపెయిడ్‌తో వీడియో బఫరింగ్ చూస్తే.. పోస్టుపెయిడ్ యూజర్ మాత్రం ఎలాంటి ల్యాగ్ లేకుండా 4K స్ట్రీమింగ్ ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఇదే టెలికాం ప్రపంచంలో కొత్త 5జీ వార్‌కు నాంది పలికింది. ఇక్కడ డేటా ఎవరికెక్కువ అనేది కాదు.. స్పీడ్ ఎవరికీ ఆగకుండా వస్తుంది అనేదే అసలు పోటీ.
ఈ గేమ్‌లో భారతీ ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ‘ప్రయారిటీ పోస్టుపెయిడ్’ సర్వీస్ భారీ (Airtel Priority PostPaid) చర్చకు దారితీసింది. వీఐపీ లేన్ తరహాలో ప్రత్యేక 5జీ నెట్ వర్క్ స్లైసింగ్ టెక్నాలజీతో పోస్టుపెయిడ్ యూజర్లకు స్పెషల్ ప్రయారిటీ ఇస్తుంది. అయితే ప్రీపెయిడ్ యూజర్ల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఎయిర్టెల్ కొత్త ‘ప్రయారిటీ పోస్టుపెయిడ్’ ఏంటి? :
భారతీ ఎయిర్టెల్ ‘ప్రయారిటీ పోస్టుపెయిడ్’ సర్వీస్‌లో స్పెషల్ 5జీ నెట్వర్క్ అనే స్లైసింగ్ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అంటే.. ఇందులో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ యూజర్లందరికి 5జీ స్పీడ్ ఒకేలా వస్తుందని అనుకుంటే పొరపాటే. సింపుల్‌గా చెప్పాలంటే.. భారీ ట్రాఫిక్‌లో వీఐపీ లేన్ ఎలా పనిచేస్తుందో అలాగే మొబైల్ డేటాలో కూడా అదే కాన్సెప్ట్. నెట్వర్క్ రద్దీగా ఉన్నా ప్రయారిటీ యూజర్లకు మాత్రమే స్పెషల్ డేటా లేన్ లభిస్తుంది.
అందుకే.. వీడియో కాల్స్, హెచ్డీ స్ట్రీమింగ్, ఆన్ లైన్ గేమింగ్‌లో ల్యాగ్ ఉండదు. పీక్ అవర్స్‌లో కూడా స్పీడ్ తగ్గదు. అదే ఈ సర్వీస్ స్పెషాలిటీ. ముఖ్యంగా 5జీ ఉన్నా స్పీడ్ రావడం లేదని ఫీల్ అయ్యే యూజర్లను టార్గెట్ చేస్తూ ఎయిర్టెల్ ఈ కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ప్రీపెయిడ్ కస్టమర్లకు లాభమా? నష్టమా? :
ప్రీపెయిడ్ యూజర్లకు బిగ్ ప్లస్ పాయింట్ బడ్జెట్ కంట్రోల్.. అతి తక్కువ ఖర్చుతోనే అన్ లిమిటెడ్ 5జీ డేటా వస్తుంది. స్టూడెంట్స్, రెగ్యులర్ యూజర్లకు చాలా బెస్ట్ ఆప్షన్ కూడా. అవసరమయ్యే రీఛార్జ్ కోసమే ఖర్చు తప్ప అదనపు బిల్లుల టెన్షన్ ఉండదు. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. మాల్స్, మెట్రో సిటీలు, స్టేడియాల్లో పీక్ టైమ్‌లో నెట్వర్క్ రద్దీ పెరిగితే నెట్ వర్క్ స్పీడ్ ఒక్కసారిగా పడిపోవచ్చు.
వీడియోలు బఫరింగ్ అవడం, ఇన్ స్టా రీల్స్ లోడింగ్ టైమ్ పట్టడం, ఆన్ లైన్ గేమ్స్ పింగ్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. అన్ లిమిటెడ్ 5జీ ఉన్నా స్టేబుల్ స్పీడ్ మాత్రం గ్యారెంటీ ఉండదు అనమాట. ఇప్పుడు ఇదే ప్రీపెయిడ్ యూజర్లలో ఆందోళనగా మారింది.
Read Also : RedMagic 11S Pro : భారీ బ్యాటరీతో కొత్త గేమింగ్ 5G ఫోన్.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?
పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బెనిఫిట్ ఇదే :
ఎయిర్టెల్ కొత్త ప్రయారిటీ పోస్టుపెయిడ్ అనేది స్పీడ్ కోరుకునే యూజర్ల కోసమే.. వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లు, గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ యూజర్లకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా జూమ్ మీటింగ్స్, హెచ్ డీ వీడియో కాల్స్, భారీ ఫైల్ అప్లోడ్ సమయంలో కనెక్షన్ స్టేబుల్‌గా ఉంటుంది. ఇండోర్ కవరేజ్ కూడా అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
అతిపెద్ద ఆఫీసులు, బేస్మెంట్లు, అపార్ట్మెంట్లలో సిగ్నల్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఓటీటీ బండిల్స్, ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్లు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. రూ. 1199 ప్లాన్‌లో 3 అదనపు కనెక్షన్లు ఫ్యామిలీలకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఒకే బిల్లుతో మొత్తం ఇంటి మొబైల్ ఖర్చులను ఈజీగా మేనేజ్ చేయొచ్చు.
యూజర్లకు నష్టమేంటి? :
ప్రాయారిటీ అనేది ఫ్రీ కాదు.. నెలవారీగా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాలి. రూ. 399 నుంచి రీఛార్జ్ ప్లాన్లు ఉంటే.. ఫుల్ బెనిఫిట్స్ కోసం ప్రీమియం ప్లాన్లపైనే ఆధారపడాలి. అంటే రెగ్యులర్ యూజర్‌కు చాలా ఖరీదైనది. అలాగే 5జీ సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్ కూడా దగ్గర ఉండాల్సిందే. పాత ఫోన్లలో ఈ నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ పనిచేయదు.
అందులోనూ ఈ కొత్త ఫీచర్ ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. అందుకే ఎక్స్ట్రా డబ్బు పెట్టి పోస్టుపెయిడ్లోకి మారాలా? నిజంగా అంత తేడా ఉంటుందా? అనే సందేహం చాలామందిలో లేకపోలేదు.
ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ మధ్య 5జీ వార్? :
ప్రస్తుతం మొబైల్ ప్లాన్లు అంటే డేటా లిమిట్, కాల్స్, ఓటీటీ ఆఫర్లపై ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికి ఫాస్ట్, స్టేబుల్ 5జీ వస్తుంది అన్నదే అసలు పోటీ. ప్రీపెయిడ్ యూజర్లకు క్వాంటటీ ఎక్కువగా ఉంటే.. పోస్టుపెయిడ్ యూజర్లకు క్వాలిటీ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఎయిర్టెల్ ట్రై చేస్తోంది. జియో, వోడాఫోన్ ఐడియా కూడా ఇదే తరహా టెక్నాలజీలను టెస్ట్ చేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ప్రీమియం 5జీ ప్లాన్లకు మార్కెట్లో గట్టి పోటీతో పాటు భారీ డిమాండ్ పెరగనుంది.
ఎవరికి ఏది బెటర్? :
మీరు ప్రీపెయిడ్ లేదా పోస్టుపెయిడ్ యూజర్ అయినా డేటా స్పీడ్ కన్నా బడ్జెట్ ముఖ్యం అనుకుంటే మాత్రం ప్రీపెయిడ్ ఉంటే చాలు. అదే సోషల్ మీడియా, యూట్యూబ్ , నార్మల్ బ్రౌజింగ్ కోసం రోజంతా మొబైల్ డేటాపైనే ఉండేవాళ్లకు ఆఫీసు వర్క్, మీటింగ్స్, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి వాటికి ఎయిర్ టెల్ ప్రాయారిటీ పోస్టుపెయిడ్ నిజంగా గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో సిగ్నల్ లేదు, నెట్ స్లో అనేవి ఉండవు.
ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ఏది అంటే.. మీ రోజువారీ అవసరాలు బట్టి ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోం అయితే మీకు ప్రయారిటీ పోస్టుపెయిడ్ బెటర్. డేటా ఎక్కువగా వాడేవాళ్లు అయితే ఓటిటి బండిల్స్ తీసుకోవచ్చు. మీరు ఎందులోకి మారినా మీ నెలవారీ డేటా వినియోగాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే.. ప్రయారిటీ పోస్టుపెయిడ్ అనేది ప్రీమియం కస్టమర్లే లక్ష్యంగా తీసుకువచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లు అందరూ 5జీ స్లైసింగ్ టెక్నాలజీ వైపు మొగ్గుచూపేలా ఎయిర్టెల్ వ్యూహాంలా కనిపిస్తోంది.
