Siddaramaiah: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను ఎలా ఒప్పించారు?
గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపించారు సిద్ధరామయ్య.
Siddaramaiah: కర్నాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ పేరు దాదాపుగా ఖరారైంది. సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో డీకే శివకుమార్ పేరు ఖరారైందని మంత్రి పాటిల్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. రేపు లేదా ఎల్లుండి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సిద్ధరామయ్య. ఇప్పటికే సీఎం పదవికి రిజైన్ చేశారు సిద్ధరామయ్య. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపించారు సిద్ధరామయ్య. కర్నాటకలో సిద్ధారామయ్య శకం ముగిసి డీకే శకం స్టార్ట్ కానుంది.
కాగా, సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను ఎలా ఒప్పించారు? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. సీఎం పోస్ట్ వదులుకోవడానికి అస్సలు ఇష్టపడని సిద్ధరామయ్య.. ఈసారి మాత్రం ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయడం సంచలనమే అని చెప్పాలి. అసలు సీఎ పదవి నుంచి దిగిపోయేలా సిద్ధారామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించిందో, దాని వెనుకున్న కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఓబీసీ (కురుబ గౌడ) నేతను జాతీయ స్థాయిలో ఫోకస్ చేయడానికి కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారట. అందుకోసం రాజ్యసభకు పంపడానికి ప్లాన్ చేశారట. కరెక్టుగా రాజ్యసభ ఎన్నికలకు ముందే ఈ పరిణామాలు జరగడం కూడా అందులో భాగమే అని విశ్లేషిస్తున్నారు. అయితే, రాజ్యసభ ఆఫర్ ని సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతా అని తేల్చి చెప్పారు. ఇక, కేసీ వేణుగోపాల్ టైప్ లో సిద్ధరామయ్యకు సైతం పార్టీలో సంస్థాగతంగా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య దిగిపోయినందుకు ఆయనకు దక్కేది ఏంటి? అని ఆరా తీస్తే.. తన వర్గం వారికి మంత్రి పదవులు డిమాండ్ చేశారట సిద్ధరామయ్య. అంతేకాదు తాను చెప్పిన వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్నారట. ఓవరాల్ గా 2029 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: రేషన్ కార్డు దారులకు, డీలర్లకు శుభవార్త.. రూ.25 వేల కోట్లతో 2031 వరకు..!
