Ntr: ‘డ్రాగన్’ దెబ్బకు ‘వారణాసి’ రికార్డ్స్ అవుట్.. ఇది ఎన్టీఆర్ ఊరమాస్ విధ్వంసం
మహేష్- రాజమౌళి వారణాసి మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్(Ntr) డ్రాగన్ మూవీ.
NTR Dragon Teaser Breaks Varanasi Teaser Records in North Belt
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సరికొత్త రికార్డులు.
- ‘వారణాసి’ టీజర్ వ్యూస్ బ్రేక్.
- హిందీ మార్కెట్లో తారక్ డామినేషన్.
Ntr: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ‘సలార్’ వంటి భారీ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై కళ్లు చెదిరే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌తో ఊరమాస్ లుక్‌లోకి మారిపోగా, ఆ న్యూ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా విడుదలైన ‘డ్రాగన్’ టీజర్ బాక్సాఫీస్ అంచనాలను మారుస్తూ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది.
ఈ టీజర్ బాలీవుడ్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న మహేష్ బాబు-రాజమౌళి కాంబో చిత్రం ‘వారణాసి’ రికార్డులను సైతం ‘డ్రాగన్’ బ్రేక్ చేసింది. హిందీ మార్కెట్లో ‘వారణాసి’ టీజర్‌కు లైఫ్‌టైమ్‌లో వచ్చిన వ్యూస్ రికార్డును, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టీజర్ కేవలం 7 రోజుల్లోనే ఊడ్చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాల టీజర్లు ఒకే లీడింగ్ మ్యూజిక్ లేబుల్ ‘టి-సిరీస్’ (T-Series) ఛానెల్లోనే విడుదలయ్యాయి. దీంతో ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై రాజమౌళి సినిమా రికార్డులను ఎన్టీఆర్ క్రాస్ చేయడం విశేషం.
ఈ ఒక్క రికార్డుతో నార్త్ బెల్ట్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ కంటే ఎన్టీఆర్(Ntr) ‘డ్రాగన్’ చిత్రానికే క్రేజ్, డామినేషన్ ఎక్కువగా ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సంచలన రికార్డుల గురించి తెలుసుకున్న తారక్ అభిమానులు కాలర్ ఎగరేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ రేంజ్ రచ్చ ఉంటే, ఇక థియేటర్లలో బొమ్మ పడ్డాక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం జరుగుతుందో అంటూ నెటిజన్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.
