రాష్ట్ర వ్యాప్తంగా 15ఏళ్ల వాహనాల నిషేదం

రాష్ట్ర వ్యాప్తంగా వాడుకలో ఉన్న 15 ఏళ్ల వాహనాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేదం అన్ని వాహనాలకు కాదు కేవలం ప్రభుత్వ వాహనాలకు మాత్రమే. పట్నా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతుందని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాటికి ఇది అమల్లోకి రానుంది. 

అత్యధిక స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొన్ని జిల్లాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ల వేయాలని ఇలా నిర్ణయించుకున్నారని చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15ఏళ్ల క్రితం పాత వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేదించనుంది. రేపటికి అధికారికంగా ప్రకటిస్తా’మని సోమవారం వెల్లడించారు. 

దేశంలో దీపావళి తర్వాత ఢిల్లీ నగర కాలుష్యం తారస్థాయికి చేరుకున్న మాట తెలిసిందే. అక్కడ సరి బేసి విధానం వాడుతున్నట్లే తామూ ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ప్రభుత్వ వాహనాలను అడ్డుకుని క్రమంగా కాలుష్యం సృష్టిస్తున్న మిగిలిన వాహనాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.