Delhi : రోడ్డుపై మహిళను 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన చైన్ స్నాచర్లు

షాలిమార్ బాగ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ మహిళ ఇంటికి వెళుతోంది.

Chain

Bike Borne Snatchers : ఛైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓ మహిళను రోడ్డుపై దాదాపు 200 మీటర్ల మేర బైక్ పై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. షాలిమార్ బాగ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ మహిళ ఇంటికి వెళుతోంది. ఈ సమయంలో ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు ఛైన్ స్నాచర్లు మహిళ బ్యాగును లాక్కొనేందుకు ప్రయత్నించారు. కానీ..ఆ మహిళ బ్యాగును గట్టిగా పట్టుకోవడంతో కిందపడిపోయింది. అలాగే…బైక్ పై వచ్చిన ఇద్దరూ..రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కారు పక్కనే పడిపోవడంతో అక్కడున్న వారు వచ్చి లేపారు.
Read More : Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..
ఇటీవలే మరో ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్…దాభా ప్రాంతంలో వెల్ కమ్ సొసైటీలో అనిత మెష్రామ్ వృద్ధురాలు నివాసం ఉంటున్నారు. ఈమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈమె ఇంటికి ఎదురుగా కూతురు, అల్లుడు నివాసం ఉంటున్నారు. 8 మంది దొంగల ముఠా ఇంట్లోకి చొరబడి..అనిత చేతులను చేతులతో కట్టేశారు. పదునైన పరికరాలతో బెదిరించారు. 98 వేల విలువైన వస్తువులు, నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. దీనిపై ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.