BJP : బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరి, స్మృతి ఇరానీలకు కీలక పదవులు.. బండి సంజయ్, డీకే అరుణకు షాక్..

BJP Announcement new national executive committee : బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటించింది.

Vasundhara Raje, Purandeswari, Smriti Irani

BJP Announcement new national executive committee : బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో అనుభవజ్ఞులతోపాటు యువ నాయకులకు పెద్దపీట వేస్తూ, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించారు. అయితే, ఈ జాబితాలో ఏపీకి బీజేపీ నేతలకు చోటు దక్కగా.. తెలంగాణ బీజేపీ నేతలకు అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం కొన్ని పదవుల్లో కొనసాగుతున్న వారిని పక్కన పెట్టడం గమనార్హం.

Also Read : Shrasti Verma : బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఏపీ బీజేపీ మహిళా నేత, ఎంపీ పురందేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీకి అవకాశం కల్పించారు. పార్టీ జాయింట్‌ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్‌ చుగ్‌, ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్‌పాల్‌ మౌర్య పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా సంస్థాగత జనరల్‌ సెక్రటరీగా బీఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా శివప్రకాష్‌ పేర్లను ఖరారు చేసింది.

ఇదిలాఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను ఆ పదవి నుంచి తప్పించడం గమనార్హం. అంతేకాక.. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ ను, ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బండి సంజయ్ లను ఆ పదవుల నుంచి తప్పించారు. ప్రస్తుత నూతన కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ నేతలకు ఎవరికీ అవకాశం దక్కలేదు.

జాతీయ ఉపాధ్యక్షులు వీరే..
♦ వసుంధర రాజే సింధియా (రాజస్థాన్),
♦ తీరథ్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్)
♦ రామ్ మాధవ్ (ఢిల్లీ)
♦ బైజయంత్ జయ్ పాండా (ఒడిశా)
♦ దగ్గుబాటి పురంధేశ్వరి (ఆంధ్రప్రదేశ్)
♦ రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్)
♦ వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి (గుజరాత్)
♦ డా. భారతి ప్రవీణ్ పవార్ (మహారాష్ట్ర)
♦ సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (పంజాబ్)
♦ లాల్ సింగ్ ఆర్య (మధ్యప్రదేశ్)
♦ ప్రొఫెసర్ ఎం. నాగరాజా (కర్ణాటక)
♦ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ (ఉత్తరప్రదేశ్)
♦ డా. మధుచంద్ర కార్ (పశ్చిమ బెంగాల్)

జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) :
♦ బి.ఎల్. సంతోష్ (ఢిల్లీ)
జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగతం)
♦ శివప్రకాశ్ (ముంబై)
♦ సౌదాన్ సింగ్ (చండీగఢ్)
జాతీయ ప్రధాన కార్యదర్శులు :
♦ వినోద్ తావ్దే (మహారాష్ట్ర)
♦ సునీల్ బన్సల్ (ఢిల్లీ)
♦ బిప్లబ్ కుమార్ దేవ్ (త్రిపుర)
♦ స్మృతి ఇరానీ (ఉత్తరప్రదేశ్)
♦ డా. సతీష్ పూనియా (రాజస్థాన్)
♦ గజేంద్ర పటేల్ (మధ్యప్రదేశ్)
♦ హరీశ్ ద్వివేది (ఉత్తరప్రదేశ్)
♦ సంజయ్ భాటియా (హర్యానా)
జాతీయ కార్యదర్శులు: కవిత పాటీదార్‌, కె.సురేంద్రన్‌, డాక్టర్ భోలాసింగ్‌, డాక్టర్ ప్రదీప్‌ వర్మ, జగదీశ్‌ ఈశ్వరభాయ్‌ పటేల్‌, డాక్టర్ సందీప్ పాఠక్‌, ఫాంగ్నోన్ కొన్యక్‌, సంగీతా యాదవ్, అనిల్ ఆంటోనీ, ఎం.వెంకటేషన్‌, మనోజ్‌ తిగ్గా, సిద్ధార్థ్‌ శంబు, స్వదేశ్‌ సింగ్‌, మృగాంగ్ దేవ్ బర్మన్, రోహన్ గుప్తా, జై ప్రకాశ్‌.
జాతీయ కోశాధికాధిరి : పీయూష్‌ గోయల్.
సంయుక్త కోశాధికారి : రాజేశ్ మంగల్‌