JP Nadda: జేపీ నడ్డా నివాసంలో కరోనా సమయంలో పని తీరుపై సమీక్ష

Jp Nadda

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ సమావేశం జరిగింది. కరోనా సమయంలో మోర్చాలు, పార్టీ సేవ కార్యక్రమాల పనితీరు ఎలా ఉండాలనే దానిపై చర్చింరాు. ఈ సమీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పాల్గొన్నారు. కరోనా అనంతరం కూడా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై నడ్డా దిశా నిర్దేశం చేశారు.

కరోనా మూడో వేవ్ ఎదుర్కోవడానికి పార్టీ, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూన్ నెలాఖరులో జాతీయ సమావేశాలు నిర్వహించాలి. మండల స్థాయి నుంచి మోర్చాలను బలోపేతం చేయాలని సూచించారు.

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి మోర్చాల సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా శనివారం సమావేశం జరిగింది. ఏడేళ్లలో ప్రభుత్వం ఆయా వర్గాలకు చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోర్చాలకు ప్రధాని పిలుపునిచ్చారు.

అన్ని రాష్టాల్లో కూడా సంస్థాగతం అయ్యేందుకు ప్రజలకు దగ్గరయ్యే అంశాలపై చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్, మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.