BJP focus on 144 LS seats it missed by small margins for Mission 2024
Mission 2024: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అటు ఇటుగా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ, భారతీయ జనతా పార్టీ అప్పుడే ఎన్నికల సన్నాహాలకు సిద్దమైంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో తృటిలో చేజారిన స్థానాలపై కన్నేసింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలా చేజారిన మొత్తం 144 స్థానాలు లక్ష్యంగా కమలం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ ఐదు రాష్ట్రాల్లోని 144 స్థానాల్లో వీలైనన్ని స్థానాలు చాలా ప్రాధాన్యంగా తీసుకుని ప్రణాళికలు రచిస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన విశ్లేషణాత్మక నివేదిక బీజేపీ వద్ద ఉన్నట్లు సమాచారం. సామాజికవర్గాల వారీగా మతాలు, కులాల వారీగా ఓటర్ల జాబితాతో పాటు వారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో కూడా నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఈ 144 నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని, సమస్యలను అధిగమించేందుకు యత్నించాలని నిర్ణయించారు.
గత రెండు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఉన్నప్పుడు సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి మరింత మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. దానికి సంబంధించి మిగిలన పార్టీల కంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల విషయంలో చాలా అప్రమత్తంగా ముందుగా ఉండే మోదీ-షాలు.. ఈ సారి ఎన్నికలకు కూడా విపక్ష పార్టీలు మేల్కొనక ముందే చక్కదిద్దుకోవాలని అడుగుటు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Viral Video: మాస్క్ పెట్టుకునే గంగాజలం తాగిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్