Karnataka: ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్.. నాలుగు దిక్కుల నుంచి రథయాత్రలు చేస్తారట

ఇక ఈ ఎన్నికల నిమిత్తం తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పాల్గొన్నారు. అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని నాలుగు దిక్కుల నుంచి బీజేపీ రథయాత్రలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రథయాత్రల రూపురేఖలను పార్టీ అగ్రనేతలతో చర్చించి ఖరారు చేస్తామని తెలిపారు

Karnataka: ఈ ఏడాది చివరి త్రైమాసికంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాలుగు దిక్కుల నుంచి రథయాత్రలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించిన బీజేపీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.

Madhya Pradesh: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్

ఇక ఈ ఎన్నికల నిమిత్తం తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పాల్గొన్నారు. అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని నాలుగు దిక్కుల నుంచి బీజేపీ రథయాత్రలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రథయాత్రల రూపురేఖలను పార్టీ అగ్రనేతలతో చర్చించి ఖరారు చేస్తామని తెలిపారు. నాలుగు రథయాత్రలకు ఎవరెవరు నాయత్వం వహించాలనేది తొందరలో నిర్ణయిస్తామని అన్నారు. బీజేపీ రథయాత్రలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 150 స్థానాలను గెలుపొందేందుకు వీలుగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నామని సీఎం బొమ్మై చెప్పారు.

Governor RN Ravi: తమిళనాడు పేరు మార్పు వివాదంపై క్షమాపణలు చెప్పిన గవర్నర్

ట్రెండింగ్ వార్తలు