BJP Jan Akrosh Yatra: ఆగేది లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాజస్థాన్‌లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రలు ..

BJP Jan Akrosh Yatra: చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు ఆయా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్-7 కొవిడ్ వేరియంట్ తరహా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఢిల్లీ, శంషాబాద్‌తోపాటు ఇతర ఎయిర్ పోర్టుల్లోనూ హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు ఆంక్షలు విధించారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రను ఆపేందుకు కరోనా అంటూ కేంద్రం సాకులు: రాహుల్ స్పందన

పొరుగుదేశం చైనాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కోరారు. ప్రస్తుతం యాత్ర రాజస్థాన్ లో సాగుతోంది. దీంతో కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందని అన్నారు. అదేవిధంగా రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జన్ ఆక్రోష్ యాత్ర ప్రారంభించారు.

BJP MLA Wore Helmet To meeting : ఇదేందయ్యో..! హెల్మెట్ పెట్టుకుని మీటింగ్‌లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే..

కొవిడ్-19 ఉధృతి నేపథ్యంలో రాజస్థాన్‌లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ న్యూఢిల్లీలో గత రెండురోజుల క్రితం ప్రకటించారు. బీజేపీకి రాజకీయాలకంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, వారి భద్రతకు బీజేపీ ప్రాధాన్యతనిస్తూ రాజస్థాన్ లో యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉన్నట్లుండి.. జన్ ఆక్రోశ్ యాత్రను కొనసాగించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే జన్ ఆక్రోశ్ సభలు జరుగుతాయని రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా యాత్రను కొనసాగించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు