Madhya Pradesh: కాంగ్రెస్ నేత పోస్టర్ చింపేసిన బీజేపీ నేతపై కేసు నమోదు

మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్‌ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతడు ప్రజలతో కూడా అనుచితంగా ప్రవర్తించాడు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమలనాథ్ పోస్టర్ చించివేసిన భారతీయ జతనా పార్టీ నేతపై కేసు నమోదు అయింది. పోస్టర్ చించేస్తున్న ఘటన వీడియో రికార్డు కావడంతో, దాన్ని సాక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని తికమ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 16వ తేదీన కుందేశ్వర దేవాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు. కమల్‌నాథ్ పోస్టర్ చించివేసిన నిందితుడిని ప్రజాతంత్ర గంగేలేగా గుర్తించారు.

Tripura: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన గంట కూడా కాకముందే త్రిపురలో అల్లర్లు

ఈ విషయమై తికమ్‌గర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారి స్పందిస్తూ ‘‘మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్‌ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతడు ప్రజలతో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. నిందితుడిపై సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’’ అని అన్నారు. ఇదిలా ఉంటే, ఈ యేడాది మధ్యలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

UP: మాయావతి నాయకత్వం కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమాజ్‭వాదీ పార్టీ ఎంపీ

ట్రెండింగ్ వార్తలు