Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామాపై డిమాండ్.. మమత, లాలూ, నితీశ్‭లను మధ్యలోకి లాగిన బీజేపీ

రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు

Railway Minister Resign: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా కోసం ప్రతిపక్ష పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్లపై అధికార భారతీయ జనతా పార్టీ గట్టిగానే బదులు ఇస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ప్రమాదాలు, మరణాలు, పట్టాలు తప్పిన జాబితాను ఊటంకిస్తూ ఒక జాబితాను బీజేపీ విడుదల చేసిన బీజేపీ.. అప్పుడు ఆ మంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తోంది.

Karnataka: దున్నపోతుల్ని చంపుతున్నాంగా ఆవుల్ని చంపితే ఏమైంది? దుమారం లేపుతున్న కర్ణాటక మంత్రి

బీజేపీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 54 ప్రమాదాలు జరిగాయి. అలాగే పట్టాలు తప్పిన ఘటనలు 839 జరగ్గా, మొత్తం 1451 మంది చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక బిహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 79 రైల్వే ప్రమాదాలు జరిగాయని, 1000 సార్లు పట్టాలు తప్పాయని, మొత్తంగా 1527 మంది చనిపోయారట. అలాగే రాష్ట్రీయజ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 51 ప్రమాదాలు జరిగాయని, 550 పట్టాలు తప్పిన ఘటనలు జరిగాయని, 1159 మంది చనిపోయారని బీజేపీ పేర్కొంది.

Bandi Sanjay: టీడీపీ-బీజేపీ మళ్లీ కలుస్తాయన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చిన బండి సంజయ్

రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం రైల్వేలను నాశనం చేసిందని, ప్రమాదం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరమే బీజేపీ ఈ డేటాను విడుదల చేసింది.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి మత రంగు పులిమారో…: వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో చేరారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా పని చేశారు. 2009 మేలో యూపీఏ-2 ప్రభుత్వంలో కూడా రైల్వే మంత్రిగా పని చేశారు. ఇక అటల్ బీహార్ వాజ్‌పేయి హయాంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం రైల్వే మంత్రిగా పని చేశారు. 2004లోని యూపీఏ ప్రభుత్వంలో లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు