బీజేపీ ఎమ్మెల్యే మృతి

బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మనోహర్‌ ఉన్‌త్వాల్‌(53) మృతి చెందారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

  • Publish Date - January 30, 2020 / 06:15 AM IST

బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మనోహర్‌ ఉన్‌త్వాల్‌(53) మృతి చెందారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మనోహర్‌ ఉన్‌త్వాల్‌(53) మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం (జనవరి 30, 202) తెల్లవారుజామున మరణించారు. మనోహర్‌ మృతి పట్ల బీజేపీ నాయకత్వం నివాళులర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లోని ఆగార్‌ నియోజకవర్గం నుంచి మనోహర్‌.. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేవాస్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆగార్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో లోక్‌సభకు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.