BJP more brutal than British rulers says Maha Cong chief
Nana Patole: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ 2014 నుంచి కొనసాగుతోందని, భారతీయ జనతా పార్టీ బ్రిటిషర్ల కంటే క్రూరంగా పాలిస్తోందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధినేత నానా పటోలె విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిషర్లు ఈ దేశాన్ని ఎలాగైతే విభజించి పాలించారో బీజేపీ కూడా ప్రస్తుతం అలాగే పాలిస్తోందని అన్నారు. తమకు మద్దతిచ్చే వారి అవినీతిని కప్పి పెడుతూ మద్దతు ఇవ్వని వారిపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి భయభ్రాంతులకు గురి చేస్తోందని పటోలె ఆగ్రహం వ్యక్తం చేశారు.
10 facts about Gehlot: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరుగుతున్న గెహ్లోత్ గురించి కీలక విషయాలు
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతా దల్ నేతల ఇళ్లల్లో సీబీఐ రైడ్లు నిర్వహించడం రాజకీయ కక్ష సాధింపు అని పటోలె అన్నారు. ఈ విషయమై బుధవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘2014 నుంచి దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయడంలో భాగంగా జరుగుతున్న కక్ష సాధింపే ఇది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతా దల్ నేతల ఇళ్లల్లో సీబీఐ రైడ్లు నిర్వహించారు. బిహార్లో అధికారం కోల్పోయామన్ని అక్కసుతోనే ఈ దాడులు జరుగుతున్నాయి’’ అని అన్నారు.
Congress YouTube channel: కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ డిలీట్
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘బీజేపీని సమర్ధించే వారిలో అవినీతిపరులు, నేరస్తులు అనేకం ఉన్నారు. కానీ వారిపై ఎలాంటి దాడులు జరగవు. బ్రిటిషర్లు ఎలాగైతే ఈ దేశాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని పాలించారో, ఇప్పుడు బీజేపీ అలాగే పాలిస్తోంది. అంతకంటే క్రూరంగానే పాలిస్తోంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీత స్థాయికి పెరిగాయి. రైతులు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేతల్ని, పార్టీలని వేధించడానికే పాలిస్తోంది’’ అని అన్నారు.