బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలిచే మిషన్ కాదు. ప్రజలకు సేవ చేయడానికే..

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భారతీయ జనతా పార్టీ చేసిన వెల్ఫేర్ గురించి జాతీయవ్యాప్తంగా కొవిడ్ 19 సమయంలో లాక్ డౌన్ గురించి మాట్లాడారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఏడు రాష్ట్రాల్లో యూనిట్లు చేసిన పనిని వీక్షించారు. పార్టీకి చెందిన బీహార్ యూనిట్ సేవా హై సంగాథన్ మీటింగ్ లో రిలీఫ్ వర్క్ గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈస్ట్ ఇండియాలో పేదరికం ఎక్కువగా ఉన్న కారణంగా కొవిడ్ 19 వ్యాప్తి ఎక్కువగా ఉందని కొందరు అనుకుంటున్నారు. అదంతా అబద్ధమని తేలింది. బీజేపీ రాష్ట్ర యూనిట్లు మోడీకి రిపోర్టు కార్డు సబ్‌మిట్ చేయాలని.. పబ్లిక్ సర్వీసుల గురించి జాతీయవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో చేసిన సర్వీస్ గురించి శనివారం సాయంత్రం చర్చించారు.

మీటింగ్ ఆరంభంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రధానిని తెగపొగిడేశారు. సంక్షోభంలో నాయకత్వం ఎంతో ధైర్యాన్ని నింపిందని అన్నారు. మీటింగ్ ఆరంభానికి ముందు మోడీ ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు. ఛాలెంజింగ్ టైమ్స్ లో పార్టీ వర్కర్లు అలసత్వాన్ని చూపించకుండా పనిచేశారు. అవసరమైన సమయంలో సహాయం అందించారు. అంటూ బీజేపీ కార్యకర్తలు దేశం కోసం సేవ చేయడంలో ముందుంటారు అని ట్వీట్ చేశారు.

ఈ మీటింగ్ లో బీజేపీ లీడర్లు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయెల్, గిరిరాజ్ సింగ్ లతో పాటు ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొన్నారు. జాతీయ రాజధాని బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి వీడియో లింక్ ద్వారా మోడీ మాట్లాడారు. ఇందులో భాగంగానే బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలిచే మిషన్ కాదు. ప్రజలకు సేవ చేయడానికే అని మోడీ అన్నారు.