బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా వివేక్ ఒబెరాయ్

గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది.

  • Publish Date - April 5, 2019 / 02:03 PM IST

గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది.

గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది. బీజేపీ రిలీజ్ చేసిన జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా,కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ,అరుణ్ జైట్లీ,నితిన్ గడ్కరీ,రాజ్ నాథ్ సింగ్,నిర్మలా సీతారామణ్ వంటి బీజేపీ అగ్రనేతలు ఈ జాబితాలో ఉన్నారు.అయితే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ కూడా ఉండటం విశేషం. 
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ

వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో “పీఎం నరేంద్రమోడీ” సినిమాను దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.మోడీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరక్కెక్కించారు.ఈ సినిమా విడుదల రాజకీయ వివాదాలకు కేంద్రబిందుగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ జాబితాలో అలనాటి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హేమా మాలినీ కూడా ఉన్నారు.గుజరాత్ లోక్ సభ,ఉప ఎన్నికల్లో వీరందరూ బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారని పార్టీ తెలిపింది.

Read Also : టీ.టీడీపీకి మరో షాక్ : TRSలోకి మండవ వెంకటేశ్వరరావు