Karnataka: బీజేపీ మంట పెడితే కాంగ్రెస్ పెట్రోల్ పోస్తోంది: సావర్కర్ అంశంపై మాజీ సీఎం

రాష్ట్రంలో వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మిత్రులు సావర్కర్ అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రులు దాన్ని అడ్డుకోవడం పక్కన పెట్టి మరింత రగిలేలా పెట్రోల్ పోస్తున్నారు. రెండు పార్టీల తీరు వల్ల కర్ణాటక ప్రజలు అసహజ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అనవసరమైన వివాదాలతో రెండు పార్టీలు కాలక్షేపం చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు

BJP spoil the atmosphere and Congress pouring petrol says kumaraswamy

Karnataka: వీర్ సావర్కర్ అంశం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. కాగా ఈ విషయమై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అయితే ఈ రెండు పార్టీల తీరుపై జనతా దళ్ సెక్యూలర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ సావర్కర్ అంశాన్ని లేవనెత్తి మంటపెడితుంటే కాంగ్రెస్ పార్టీ దానికి పెట్రోల్ పోస్తోందని విమర్శలు గుప్పించారు.

ఈ విషయమై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మిత్రులు సావర్కర్ అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రులు దాన్ని అడ్డుకోవడం పక్కన పెట్టి మరింత రగిలేలా పెట్రోల్ పోస్తున్నారు. రెండు పార్టీల తీరు వల్ల కర్ణాటక ప్రజలు అసహజ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అనవసరమైన వివాదాలతో రెండు పార్టీలు కాలక్షేపం చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు’’ అని కుమారస్వామి అన్నారు.

శివమొగ్గలోని అమీర్‌ అహ్మద్‌ సర్కిల్‌లో సావర్కర్‌, టిప్పు సుల్తాన్‌ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీల విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవతో ఉద్రిక్తతలు రేగాయి. దీంతో పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు. ఓ గ్రూపు సావర్కర్‌ ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించిందని, అక్కడ టిప్పు సుల్తాన్‌ ఫ్లెక్సీ పెట్టుకోవాలంటూ మరో గ్రూపు అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఇది రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదం జరిగిందని, అనంతరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఫ్లెక్సీలు కట్టాలనుకున్న ప్రాంతంలో పోలీసులు జాతీయ జెండా ఏర్పాటు చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

Nitin Gadkari: ప్రభుత్వం సరైన టైంలో నిర్ణయాలు తీసుకోవట్లేదు: గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు