BJP MLA: టీఎంసీలోకి బీజేపీ ఎమ్మెల్యే.. గుండు గీయించుకుని పాపాలు పోయాయంటూ..

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన ఆయన బీజేపీలో పనిచేసి తాను పాపం చేశానని గుండు గీయించుకుని పవిత్ర గంగానదిలో స్నానం చేసి వాటిని కడిగేసుకున్నానని అన్నారు.

Bjp To Tmc

BJP MLA: కోల్‌కతాకు వెళ్లిన మూడు రోజులకే బీజేపీ త్రిపుర ఎమ్మెల్యే ఆశిష్ దాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన ఆయన బీజేపీలో పనిచేసి తాను పాపం చేశానని గుండు గీయించుకుని పవిత్ర గంగానదిలో స్నానం చేసి వాటిని కడిగేసుకున్నానని అన్నారు. అంతేకాకుండా త్రిపుర 2023ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నుంచి దించేదాకా తాను వెంట్రుకల పెంచనని వ్యాఖ్యానించారు.

‘త్రిపుర సీఎం బిప్ లాబ్ దేవ్ ప్రభుత్వం తప్పుడు ప్రవర్తన పార్టీ వదిలేసేలా చేసింది. అందుకే గుండు గీయించుకుని పవిత్ర గంగానదిలో స్నానం చేసి పాపాలు కడిగేసుకున్నా. బీజేపీలో పని చేసిన పాపాన్ని వదిలించుకున్నా’ అని ఆశిష్ వ్యాఖ్యానించారు.

టీఎంసీ వర్గాల ప్రకారం.. ఆశిష్ తో పాటు మరికొంత మంది లీడర్లు త్రిపుర నుంచి బుధవారం టీఎంసీలో జాయిన్ అవనున్నారు. టీఎంసీ ప్రెసిడెంట్ సుబ్రతా బక్షిని అక్టోబర్ 2న కలిశారు ఆశిష్. ‘టీఎంసీలో జాయిన్ అవుతున్నందున అతణ్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. బీజేపీ క్యాడర్ ఉన్న పార్టీ. అతను వెళ్లిపోవడం పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదు’ అని త్రిపుర బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు.

 

……………………………………….. : అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్

బీజేపీ లీడర్ నబేందు మాట్లాడుతూ.. ఘటన గురించి తనకేం తెలియదని పార్టీ సీనియర్ లీడర్లు ఆశిఫై తగు యాక్షన్ తీసుకుంటారని చెప్పారు.