Covid Blood clots: ‘చాలా కొవిడ్ కేసుల్లో ఐదో రోజు నుంచే రక్తం గడ్డ కడుతుంది’

కొవిడ్ రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తే ఎలా ఉంటుందంటే. ఇలా జరగడం వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్, అవయవాలను కోల్పోయే ప్రమాదముంది.

Covid Blood clots: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు సంవత్సరం నుంచి వేధిస్తున్నాయి. తొలినాళ్లలో వైరస్ గురించి అర్థం కాకపోయినా నెలల తరబడి చేసిన పోరాటంతో వైద్యులకు ఈ మహమ్మారి పట్ల అవగాహన వచ్చింది. అయితే ఇది రూపాంతరం చెందుతూ కొత్త మ్యూటేషన్స్ తో ఇబ్బందిపెడుతూనే ఉంది. రీసెంట్ గా మొదలైన సమస్యల్లో ఒకటి కొవిడ్ వచ్చిన నాలుగైదు రోజుల్లోనే రక్తం గడ్డకట్టడం ఒకటి.

చాలా మంది కొవిడ్-19 పేషెంట్లలో వారి రక్త కణాల్లో గడ్డ కట్టినట్లు గమనించారు. సరైన సమయానికి ట్రీట్ చేయకపోతే హార్ట్ అటాక్, స్ట్రోక్, అవయవాలు కోల్పోవడం వంటివి జరిగినట్లు గుర్తించారు. మే5న న్యూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ కు డా.అంబరీష్ సాత్విక్ అనే వాస్క్యూలర్ సర్జన్ చేసిన ఫొటో పోస్టు ట్విట్టర్లో వైరల్ అయింది.

కొవిడ్-19 పేషెంట్ అవయవాల నుంచి గడ్డ కట్టిన రక్తం నమూనాలను బయటకు తీస్తున్న ఫొటో అది.

‘కొవిడ్ గడ్డలు ఎలా ఉంటాయో తెలుసా. కొవిడ్ రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తే ఎలా ఉంటుందంటే. ఇలా జరగడం వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్, అవయవాలను కోల్పోయే ప్రమాదముంది. కొవిడ్ ఒక్కొక్కరిలో 2నుంచి 5శాతం వరకూ మార్పు ఉంటుంది. ఈ గడ్డకట్టిన రక్తాన్ని కొవిడ్ పాజిటివ్ పేషెంట్ అవయవాల నుంచి తొలగించి ఆయణ్ను బతికించాం అని డా.సాత్విక్ ట్వీట్ చేశారు.

అప్పట్నుంచి ఆయన చేసిన ట్వీట్ 4వేల సార్లు రీట్వీట్ కాగా ట్విట్టర్లో 10వేల మంది లైక్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు