కోర్టు ప్రాంగణంలోనే లాయర్‌పై బాంబు దాడి 

  • Publish Date - February 13, 2020 / 08:06 AM IST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న హజ్రత్ గంజ్ లోని కల్నో కలెక్టరేట్ లో..యూపీ విధాన సభను కిలోమీటరు దూరంలో ఈ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి.

బాంబు పేలుడుపై సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన డాగ్ స్వాడ్, బాంబు స్వాడ్.. క్లూస్ టీమ్ తో  ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలానికి సమీపంలో మరో మూడు పేలని బాంబులను గుర్తించారు. వివరాల్లోకి వెళితే..న్యాయవాదులు మధ్య వచ్చిన విభేదాలు ఈ బాంబు పేలుడుకు కారణంగా తెలుస్తోంది

లక్నో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సంజీవ్ లోధి తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిజరిగింది. బాంబు దాడి చేసిన వ్యక్తిని జీతు యాదవ్ గా పోలీసులు గుర్తించారు. స్థానికంగా తయారు చేసిన బాంబుతో సంజీవ్ లోధిపై దాడికి పాల్పడ్డాడని వజీర్గంజ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మరో మూడు పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.