అస్సాంలో ఘోరం : కల్తీ మద్యం తాగి 17 మంది మృతి

  • Publish Date - February 22, 2019 / 08:39 AM IST

అస్సాంలోని గోలాఘాట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందారు.  ఈ ఘటన (ఫిబ్రవరి 21) గురువారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను  గోలాఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారిని పరీక్షించిన డాక్టర్స్ కల్తీ మద్యం తాగటం వల్లనే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. 

గత నాలుగు రోజుల క్రితం మద్యం తాగి నలుగురు వ్యక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మరో 17మంది మరణించటంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. మరణించిన వారి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 

కాగా గతంలో ఉత్తరాఖండ్, మీరట్, సహారన్పూర్, రూర్కీ, ఉత్తరాఖండ్లోని కుషినగర్లో గతంలో డ్రగ్స్ బారినపడి 90 మంది మరణించారు. మీరట్లో 18, సహార్ పూర్ లో 36, రూర్కీలో 20, కుషినగర్లో 8 మంది మరణించారు. ఓ ఫంక్షన్ లో కల్తీ మద్యం తాగడంతో వీరంతా మరణించినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.