బస్సులో సీట్ కోసం యత్నం: ఇరుక్కుపోయిన బాలుడి తల 

  • Publish Date - October 30, 2019 / 10:46 AM IST

బస్సులో సీటు కోసం ఓ తల్లి అత్యుత్సాహం పిల్లాడు ప్రాణం మీదికి తెచ్చింది. భయ్యాదూజ్ పండుగ సందర్భంగా బస్సు కింద నుంచి బాలుడిని బస్సు ఎక్కించే యత్నంలో ఈ  ఘటన చోటుచేసుకుంది. భయ్యాదూజ్ పండుగకు వెళ్లే  ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్ లో బస్సులు, రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి.  రిజర్వేషన్ చేయించుకోని వారంతా చివరి నిముషంలో బస్సుల్లో, రైళ్లల్లో ఎక్కేందుకు ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు.బస్సులో సీట్  బస్సుల టాప్ లపైకి కూడా ఎక్కి ప్రయాణిస్తున్నారు. 

ఈ క్రమంలో యూపీలోని బిజ్‌నౌర్ జిల్లాలో ఈ బాలుడి ఘటనతో ఒక్కసారిగా ప్రయాణీకులంతా హడలిపోయారు.బస్సులో సీటు దక్కించుకునేందుకు చిన్నపిల్లలను కిటికీలో నుంచి బస్సులోనికి ఎక్కిస్తున్నారు. ఒక తల్లి తన కుమారుణ్ణి కిటికీ గుండా బస్సులోనికి ఎక్కించేందుకు యత్నించింది.  పిల్లాడి శరీరం అంతా బస్సులోకి వెళ్లింది.. కానీ తల మాత్రం  కిటికీకి అడ్డుగా ఉన్న ఇనుమ రాడ్ కిందుగా ఆ బాలుడి తల  మెడ వరకూ చిక్కుకుపోయింది.
ఆ పిల్లవాడు భయపడిపోయాడు. పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేశాడు. తల్లి కుమారుడి పరిస్థితికి ఏడుస్తూ నా బిడ్డను రక్షించండి అంటూ అక్కడ ఉన్న తోటి ప్రయాణీకులను వేడుకుంది. బిడ్డడు ఏమైపోతాడోనని కన్నీరు మున్నీరుగా విలపించింది.  వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీయటంతో ప్రమాదం తప్పింది. 

కాగా..కార్తీక మాసంలో జ‌రిగే బాయీ దూజ్ వేడుకను ఉత్తరాదివారు తప్పనిసరిగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోద‌రీమ‌ణులు త‌మ సోద‌రులకి హార‌తి ఇచ్చి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాల‌ని కోరుకుంటారు. అంతేకాదు ఆ రోజు త‌మ సోద‌రులకు (అన్నదమ్ములకు) గిఫ్ట్‌లు కూడా ఇస్తారు. రాఖీ పండుగ మాదిరిగానే ఈ పండుగ వేడుక‌ని జ‌రుపుకుంటారు.