Viral video: పెళ్లొద్దంటూ పరుగు పెట్టిన వరుడు.. వెంబడించి పట్టుకుని పెళ్లాడిన వధువు
బిహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఒకరోజు భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో ఉంటున్న యువకుడి ఇంటికి వెళ్లి ఇదే విషయమై అడుగుతుండగా.. అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
- tony bekkal
- Published On : August 30, 2022 / 06:42 PM IST
bride chase groom after he refuses marriage
Viral video: రోజుకు వందల పెళ్లిల్లు జరుగుతుంటాయి. కానీ కొన్నే ఎక్కువ మందికి తెలుస్తాయి, ఎక్కువ రోజులు గుర్తుంటాయి. అన్ని సార్లు సెలెబ్రిటీల పెళ్లిల్ల మీదే చర్చ జరగదు. కొన్ని సార్లు అతి సామాన్య జనాల పెళ్లిల్ల గురించి కూడా చర్చ
జరుగుతుంటుంది. కారణం.. పెళ్లిలో ఉండే వైవిధ్యం. సినిమాల్లో అయితే పెళ్లిల్లలో చాలా వైవిధ్యం ఉంటుంది. రన్నింగ్‌లు, చేజింగ్‌లు, జంపింగ్‌లు, ఫైటింగ్‌లు.. అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు ఇలాంటివి
నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి.
అవును.. బిహార్‌లో జరిగిన ఒక పెళ్లి ఇలాంటిదే. పెళ్లి వద్దంటూ వరుడు పరుగందుకుంటే, వధువు శివంగిలా వెంటాడి వరుడిని పట్టుకుంది. తన మాట వినకపోవడంతో పోలీసులను ఆశ్రయించడంతో కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి వివాహం చేశారు.
వరుడు పరుగెత్తడం, వధువు వెంబడిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హడావుడి చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటిజెన్లు కొందరు వధువు ధైర్యసాహసాలను పొగుడుతుండగా.. మరికొందరు పెళ్లిపై జోకులు వేసుకుంటున్నారు.
एक शादी ऐसा भी
जब शादी करने से भाग रहा था लड़का, तब लड़की ने उसे खुद पकड़कर रचाई शादी
मामला #बिहार के #नवादा का है। लड़की ने कहा कि पैसा और बाइक लेकर शादी करने से भाग रहा था लड़का#ExclusivePost#xclusivepost pic.twitter.com/LSpch8Sp5a
— Exclusive Post (@xclusivepost) August 28, 2022
విషయంలోకి వెళ్తే.. బిహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. వధువు కుటుంబానికి కోప్పమొచ్చి ఒకరోజు భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో ఉంటున్న యువకుడి ఇంటికి వెళ్లి ఇదే విషయమై నిలదీయగా.. అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
అంతే.. వధువు వెంటనే శివంగిలా మారి అతడిని వెంబడించింది. వధువు తరపు బంధువుల సాయంతో ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇంత జరిగినా పెళ్లికి అతడు ససేమిరా అనడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో చివరకు వధువును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించక తప్పలేదు. ఇక ఆలస్యం చేస్తే ప్రమాదమని ఆ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఓ గుడిలో కుటుంబ సభ్యులంతా కలిసి ఇద్దరికి వివాహం జరిపించారు.
Shah Rukh Khan: ప్రమోషన్స్ కోసం ప్రేక్షకుల ముందుకు రాను అంటున్న షారుఖ్.. కారణమదేనా?
