నీ త్యాగం వృథా కానివ్వను: గుర్రం దిగిన పెళ్లికొడుకు.. అమర జవాన్ కు సెల్యూట్

పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు ఎదురుచూస్తోంది. పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం. వివాహం జరగడమే మిగిలింది. సంప్రదాయపరమైన దుస్తులు ధరించి పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి గుర్రంపై బయల్దేరాడు.

  • Publish Date - February 27, 2019 / 08:18 AM IST

పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు ఎదురుచూస్తోంది. పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం. వివాహం జరగడమే మిగిలింది. సంప్రదాయపరమైన దుస్తులు ధరించి పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి గుర్రంపై బయల్దేరాడు.

పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు ఎదురుచూస్తోంది. పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం. వివాహం జరగడమే మిగిలింది. సంప్రదాయపరమైన దుస్తులు ధరించి పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి గుర్రంపై బయల్దేరాడు. ఇంటి దగ్గర నుంచి బ్యాండు మేళం, టపాసుల సందడితో ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇంతలో అదే మార్గంలో అమర జవాన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమర జవాన్ అజయ్ కుమార్ కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఊరేగింపు జరుగుతోంది. జవాన్ అంత్యక్రియలను చూసి మీరట్ పెళ్లికొడుకు హృదయం చలించిపోయింది.

వెంటనే గుర్రం మీదనుంచి కిందికి దిగిపోయాడు. అమర జవాన్ త్యాగాన్ని వృథాగా పోనివ్వనంటూ పెళ్లి వేడుక ఆపేశాడు. దేశ సేవ కంటే పెళ్లి వేడుక ఎక్కువ కాదని నిర్ణయించుకున్నాడు. బరాత్ (గుర్రంపై ఊరేగింపు) కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు. గుర్రం మీద నుంచి దిగి.. తన సోదరితో కలిసి వీర జవాన్ కు సెల్యూట్ చేశాడు. అమర జవాన్ల పట్ల తనకు ఉన్న గౌరవభావాన్ని ఇలా చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ మీరట్ పెళ్లికొడుకు. దీనికి సంబంధించిన ఫొటోను హర్ష్ గోయంకా అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. 

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్ పీఎఫ్ జవాన్లలో సిపాయి అజయ్ కుమార్ ఒకరు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్ అజయ్ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా తన ఆవేదన వెలిబుచ్చింది. పాకిస్థాన్ ను నాశనం చేసే శక్తి భారత్ కు ఉందని తెలిపింది. తన కుమారుడి లాంటి ఎందరు తల్లుల కుమారులను పాకిస్థాన్ పొట్టనబెట్టుకుందని వాపోయింది. భారత్ నాశనం చేయాలేకపోవడానికి పాకిస్థాన్ పెద్ద దేశమేమీ కాదని, ఏదో ఒక రోజు భారత్ పాక్ ను నాశనం చేయగలదని తెలిపింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తన కుమారుడిని చూసి గర్వపడుతున్నట్టు వీర జవాన్ తల్లి చెప్పింది.  

ట్రెండింగ్ వార్తలు