Uttar Pradesh : తాళి కట్టే సమయంలో అదనపు కట్నం డిమాండ్.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు
కొద్ది క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అంతలోనే వరుడు అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
- bheemraj
- Published On : June 16, 2023 / 07:22 AM IST
groom tied tree
Groom Tied Tree : తాళి కట్టే సమయంలో అదనపు కట్నం డిమాండ్ చేసిన వరుడిని వధువు కుటుంబీకులు చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతీ యువకుల పెళ్లికి ఇరువురి కుటుంబీకులు సర్వం సిద్ధం చేశారు. వివాహ వేడుకకు ఇరువురి బంధువులు తరలి వచ్చారు. వరుడితో సహా కుటుంబీకులు ఊరేగింపుతో వధువు ఇంటికి వచ్చారు.
కొద్ది క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అంతలోనే వరుడు అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వరుడికి నచ్చజేప్పేందుకు ఎంతసేపు ప్రయత్నించినా వినకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు ఆఖరికి వరుడిని చెట్టుకు కట్టేశారు.
Road Accident In Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..15మంది మృతి
అలాగే వరుడి తరపున వచ్చిన చాలా మంది అతిథులు కూడా బందీలుగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోజంతా పంచాయితీ జరిగినా ఫలితం లేకుండా పోయింది.
