Road Accident In Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..15మంది మృతి

కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సెంట్రల్ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి సెమీ ట్రైలర్ ట్రక్కు, సీనియర్లతో కూడిన బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు.....

Road Accident In Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..15మంది మృతి

Road Accident In Canada

Updated On : June 16, 2023 / 5:50 AM IST

Road Accident In Canada: కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సెంట్రల్ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి సెమీ ట్రైలర్ ట్రక్కు, సీనియర్లతో కూడిన బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు.ఈ దుర్ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు కెనడా అధికారులు తెలిపారు.(15 Killed In Road Accident)హైవే వన్, హైవే ఫైవ్ కూడలిలో 25 మంది ప్రయాణిస్తున్న బస్సు సెమీ ట్రక్కుని ఢీకొట్టిందని మానిటోబా అధికారి రాబ్ హిల్ చెప్పారు.మినీబస్సులో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు.

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్లు కెనడా అధికారులు నిర్ధారించారు. గాయపడిన మరో 10 మందిని ఆసుపత్రికి తరలించారు.కార్బెర్రీకి ఉత్తరాన ట్రాన్స్-కెనడా హైవేపై ఈ ప్రమాదం జరిగింది.రోడ్డు ప్రమాదం అనంతరం సహాయ చర్యల కోసం అత్యవసర వాహనాలు, రెండు హెలికాప్టర్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో మంటలు అంటుకున్నాయి.

Earthquake: ఐర్లాండ్ దేశ టోంగాలో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపిందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన అధికారిక ట్విట్టర్ ఫీడ్‌లో తెలిపారు.‘‘కార్బెర్రీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం వార్త విని నా గుండె పగిలింది. ఇందులో మరణించిన వారందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని మానిటోబా ప్రీమియర్ హీథర్ స్టెఫాన్సన్ ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదం అనంతరం హైవేను మూసివేశారు.