Shah Rukh Khan : కేకేఆర్ ఫ్రాంచైజీ ద్వారా షారుఖ్ ఖాన్ ఏడాదికి ఎంత సంపాదిస్తాడు?
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan ) సహ యజమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
How much does Shah Rukh Khan earn from KKR In IPL one season
Shah Rukh Khan : ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. ఈ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధానంగా వార్తల్లో నిలిచింది.
వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం రూ.25.20 ఖర్చు చేసింది కేకేఆర్. ఈ క్రమంలో గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Suryakumar Yadav : నాలుగేళ్లలో ఇదే తొలిసారి.. సూర్య ఇదేందయ్యా..
కేకేఆర్ ఇటీవల కాలంలో గొప్ప విజయాలను సాధించింది. ఐపీఎల్ 2024 సీజన్ విజేతగా నిలిచింది. ఈ విజయం వారి ఖాతాలో మరో టైటిల్‌ను జోడించడమే కాకుండా ఆ జట్టు బ్రాండ్ విలువను భారీగా పెంచింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి కూడా కేకేఆర్ అత్యధిక ప్రజాదారణను కలిగి ఉంది. దీనితో పాటు స్పాన్సర్‌షిప్ విలువ, వాణిజ్య వృద్ధి స్థిరంగా పెరుగుతూ వస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సహ యజమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
షారుఖ్ ఖాన్ ఐపీఎల్ ద్వారా ఎంత సంపాదిస్తాడు?
మంచి జట్టును నిర్మించేందుకు షారుఖ్ ఖాన్ భారీగా ఖర్చు చేస్తాడు. ఇక అతడికి వచ్చే రాబడి కూడా అంతే విధంగా ఉంటుంది. వివిధ నివేదికల ప్రకారం.. ప్రతి ఐపీఎల్ ఫ్రాంఛైజీకి బీసీసీఐ ఐపీఎల్ ద్వారా సంపాదించే ఆదాయంలో వాటా ఇస్తూ ఉంటుంది. ఇందులో టెలివిజన్ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు ప్రధానంగా ఉంటాయి. దీనితో పాటు ఐపీఎల్ జట్లకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఫ్రాంచైజ్ స్పాన్సర్‌షిప్‌లు, మ్యాచ్ సంబంధిత ఆదాయం, బహుమతి డబ్బు, బీసీసీఐ నిర్వహించే ఈవెంట్‌ల నుండి వచ్చే ఆదాయం ద్వారా కూడా ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది.
IPL 2026 Auction : 10 ఫ్రాంఛైజీలు రూ.215 కోట్లలో జస్ట్ ఈ ఐదుగురు ప్లేయర్స్ కే 40 శాతం పర్సు ఫసక్..
ఐపీఎల్ ద్వారా షారుఖ్ ఖాన్ ఏటా దాదాపు రూ.250 నుండి రూ.270 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో నుంచి అతను జట్టు కార్యకలాపాలు, ఆటగాళ్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తాడు. ఈ ఖర్చుల తర్వాత కూడా ఐపీఎల్ సీజన్‌కు అతని నికర లాభం రూ.150 నుండి రూ.170 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
షారుఖ్ ఖాన్, జూహి చావ్లా, ఆమె భర్త జే మెహతా సంయుక్తంగా కేకేఆర్ జట్టులో యజమానులు ఉన్నారు. ఇక ఫ్రాంచైజీలో షారుఖ్ ఖాన్ 55 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ వాటా ఆధారంగా ఒక ఐపీఎల్ సీజన్ నుండి అతని వ్యక్తిగత ఆదాయం దాదాపు రూ. 80 కోట్లు ఉంటుందని అంచనా.
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన నటుడు..
ఐపీఎల్ ద్వారా షారుఖ్ ఖాన్ పొందే ఆదాయం అతడి మొత్తం సంపదలో కూడా ప్రతిబింబిస్తుంది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. అతని నికర విలువ రూ. 12,490 కోట్లుగా ఉంది. 2024లో అతని నికర విలువ దాదాపు రూ. 7,300 కోట్లుగా నమోదైంది. కేవలం ఒక సంవత్సరంలో దాదాపు రూ.5000 కోట్ల పెరుగుదలను చూపిస్తుంది. ఈ పెరుగుదల ఐపీఎల్ అతని సినీ కెరీర్‌తో పాటు ప్రధాన ఆదాయ వనరుగా ఎలా మారిందో హైలైట్ చేస్తుంది.
