Samsung Galaxy S25 Plus : శాంసంగ్ లవర్స్ కొనాల్సిన ఫోన్.. గెలాక్సీ S25 ప్లస్‌పై రూ. 30వేలు తగ్గింపు.. ఇప్పుడే కొనడం బెటర్..!

Samsung Galaxy S25 Plus : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ భారీగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/6Samsung Galaxy S25 Plus
Samsung Galaxy S25 Plus : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఈ ఏడాదిలో అత్యంత అద్భుతమైన లైనప్‌లలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ మొత్తం 3 ఫోన్లు ఉన్నాయి. అందులో శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్లు ఉన్నాయి.
2/6Samsung Galaxy S25 Plus
ఈ ఫోన్లలో ప్లస్ వేరియంట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు, అమెజాన్‌లో ఈ శాంసంగ్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.. డోంట్ మిస్..
3/6Samsung Galaxy S25 Plus
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర తగ్గింపు : అమెజాన్‌లో ఈ గెలాక్సీ S25 ప్లస్ 5G ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 71,999కు అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ. 71,999 నుంచి తగ్గింపు పొందింది. అంతేకాకుండా, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన అన్ని కస్టమర్లు కొనుగోలుపై రూ. 2,159 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ నేవీ, సిల్వర్ షాడో అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4/6Samsung Galaxy S25 Plus
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ 2600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రన్ అవుతుంది.
5/6Samsung Galaxy S25 Plus
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి.
6/6Samsung Galaxy S25 Plus
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా పొందుతుంది. 4900mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.